కోలీవుడ్ మీడియాతో టాలీవుడ్ ని పొగిడి ఇరుక్కుపోయిన వరలక్ష్మి శరత్ కుమార్..

-

లేడీ విలన్ పాత్రలకు పెట్టింది పేరుగా మారిపోయారు వరలక్ష్మి శరత్ కుమార్. పవర్ఫుల్ విలన్ గా కనిపిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు. కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ తెలుగులో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. అయితే తాజాగా కోలీవుడ్ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసి ట్రోలింగ్ కు గురయ్యారు..ఏ విషయం నైనా నిరభ్యతరంగా మాట్లాడే వ్యక్తి వరలక్ష్మి శరత్ కుమార్. ఇప్పటికే కొన్ని విషయాల్లో ఇలా మాట్లాడి విమర్శలకు పాలయ్యారు.. అయితే మరొకసారి తమిళ ఇండస్ట్రీపై వైరల్ కామెంట్స్ చేసి వారి ఆగ్రహానికి గురయ్యారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన వరలక్ష్మి తమిళ ఇండస్ట్రీలో ఎందరో ప్రతిభ కలిగిన నటీనటులు ఉన్నారని కానీ వారందరికీ ఆదరణ దక్కట్లేదని చెప్పుకొచ్చారు..

అంతేకాకుండా కోలీవుడ్ మీడియాతో టాలీవుడ్ను ఆకాశానికి ఎత్తేశారు. టాలీవుడ్ లో నాకు ఎంతో మంచి ఆదరణ దక్కుతుంది. తెలుగు ప్రేక్షకులు అందరూ నన్ను వారి కన్నా బిడ్డ లాగా చూసుకుంటున్నారు అలాగే ముందే నా కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్ ను సైతం డిజైన్ చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది. అక్కడితో ఆగకుండా త్వరలోనే హైదరాబాద్ కు షిఫ్ట్ అవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలిపారు.. తమిళ మీడియాతో ఈ రకంగా మాట్లాడటం వారిని ఆగ్రహానికి గురి చేసింది. దీంతో తమిళనాడు నెటిజన్స్ వరలక్ష్మిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు..

Challenge yourself and be surprised: Varalaxmi Sarathkumar

నిజానికి వరలక్ష్మి శరత్ కుమార్ ను నటిగా మార్చింది తమిళ తేరే. అక్కడివారు ఆమెను ఎంతగానో ఆదరించారు. కొన్ని సినిమాలు తమిళంలో చేసిన అనంతరం టాలీవుడ్కు వచ్చారు. అయితే వరలక్ష్మి ఈ విషయాన్ని మరిచిపోయి తమిళ ఇండస్ట్రీ పైన విషం చిమ్ముతున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఆమె తెలుగు సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారని అక్కడికి వెళ్ళిపోయే ఉద్దేశంతో ఇలా మాట్లాడుతున్నారంటూ చెప్పుకొస్తున్నారు.. నిన్ను నటిగా మార్చిన ఇండస్ట్రీని వదిలిపెట్టి నాలుగు అవకాశాలు వచ్చాయని పక్క ఇండస్ట్రీకి వెళ్లిపోవడమే కాకుండా నటిని చేసిన ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడటం సమంజసమేనా అంటూ ఫైర్ అవుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news