ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. చాలా మంది రకరకాల సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. నిజానికి సమస్యలు ఏమి లేకుండా ఆనందంగా ఉండాలంటే ఈ అద్భుతమైన చిట్కాల్ని పాటించాల్సిందే. వీటిని అనుసరించడం వలన ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆనందంగా ఉండొచ్చు. మరి ఇక ఆ టిప్స్ గురించి చూసేద్దాం.
నిద్రపోయేటప్పుడు ఎప్పుడూ కూడా దక్షిణ దిశ లో కానీ తూర్పు వైపు కి కానీ నిద్రపోవాలి ఇలా నిద్రపోతే ఆరోగ్యం బాగుంటుంది. సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఉత్తరం వైపు నిలబడి వంట చేయడం తినడం మంచిది కాదు. వీలైనంతవరకు ఈ తప్పు చేయకుండా చూసుకోండి. తూర్పు వైపు కూర్చుని తింటే అనారోగ్య సమస్యలు రావు ఆర్ధిక సమస్యలు కూడా ఉండవు. రాత్రిపూట సామాన్లని కడక్కుండా అంట్ల గిన్నెలని అలా వదిలేయకూడదు. అంట్ల గిన్నెలని అలా వదిలేస్తే నెగటివ్ ఎనర్జీ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది.
అలానే అద్దంలో కనపడటం మంచిది కాదు వీలైనంతవరకు అద్దాలు పెట్టుకోకండి. అంతే కాక వంటగది కి దగ్గర్లో టాయిలెట్ ఉండకుండా చూసుకోండి చాలా మంది ఈ తప్పును చేస్తూ ఉంటారు. వీలైనంత దూరంగా ఈ రెండిటిని కట్టుకోవడం మంచిది. అలానే మంచాన్ని పెట్టేటప్పుడు గోడకి మూడు ఇంచులు దూరంలో ఉండేటట్టు చూసుకోండి. చూశారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన వాస్తు చిట్కాలని. వీటిని కనుక పాటిస్తే ఖచ్చితంగా ఏ బాధ లేకుండా ఉండొచ్చు ఆనందంగా ఆరోగ్యంగా జీవించొచ్చు.