వాస్తు: దీపావళికి వీటిని అనుసరిస్తే అంతా మంచే కలుగుతుంది..!

-

హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో దీపావళి పండుగ ఒకటి. దీపావళి నాడు మంచి జరగాలని.. చెడు దూరం అయిపోవాలని అందరూ పండుగను జరుపుకుంటారు. అయితే దీపావళి పండుగ నాడు నెగటివ్ ఎనర్జీ పోయి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కలగాలంటే ఈ చిట్కాలను పాటించండి. పండితులు ఈ రోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని షేర్ చేసుకోవడం జరిగింది. వీటిని అనుసరిస్తే తప్పకుండా మంచి కలిగి చెడు తొలగిపోతుంది.

ఇక పండితులు చెబుతున్న చిట్కాల గురించి చూస్తే… ఏ పండగైనా ఇంటిని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే దీపావళికి కూడా ఇంటిని శుభ్రం చేసుకుని అందంగా అలంకరించుకోవడం ఎంతో ముఖ్యం.ఇల్లు శుభ్రంగా ఉన్నప్పుడు లక్ష్మీ దేవి ఇంటికి వస్తుంది అందుకనే చెత్తాచెదారాన్ని తొలగించాలని పండితులు అంటున్నారు.

అలానే లక్ష్మీ దేవిని మీరు పెట్టేటప్పుడు ఉత్తరం వైపు ఫేసింగ్ ఉండేటట్టు చూసుకుని పెట్టండి. అలాగే లక్ష్మీ దేవి ముందు ఆభరణాలు, డబ్బులు వంటివి పెడితే మంచిది. పూజ గదిలో దీపాలని పెట్టడం లేదా లైట్లని పెట్టడం లాంటివి చేయాలి.

అందమైన రంగు రంగు దీపాలతో ఇల్లుని ఉంచితే మరింత మంచి కలుగుతుంది. నీలం రంగు, ఆకుపచ్చ, ఎరుపు మొదలైన అన్ని రంగుల తో ఇల్లు కళకళ్ళాడేలా చూసుకోండి ఇలా ఈ విధంగా దీపావళి నాడు వాస్తు చిట్కాలను పాటిస్తే ఎంతో మంచి కలుగుతుంది అలానే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కనుక తప్పకుండా ఈ విధంగా అనుసరించడం మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version