పన్నీర్ తో పాటు శాఖాహారులు వీటి నుండి కూడా ప్రోటీన్ పొందొచ్చు..!

-

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలి. అయితే శాకాహారులకి కొన్ని ఆహార పదార్థాలు మాత్రమే ఉంటాయి మాంసాహారులకు మాంసం మొదలైనవి కూడా ఉంటాయి. అయితే శాఖాహారులు ప్రోటీన్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.

కేవలం పన్నీరు మాత్రమే కాకుండా వివిధ రకాల ఆహార పదార్ధాలలో కూడా ప్రోటీన్ ఉంటుంది. వాటిని కూడా శాకాహారులు తీసుకుంటే ప్రోటీన్ శాతం ఎక్కువగా అందుతుంది. అయితే మరి శాఖాహారులు పన్నీర్ తో పాటు ప్రోటీన్ ఎలా పొందాలి అనేది ఇప్పుడు చూద్దాం.

గ్రీక్ యోగర్ట్:

గ్రీక్ యోగర్ట్ లో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. ఆరోగ్య నిపుణులు ఒక సర్వింగ్ గ్రీక్ యోగర్ట్ లో 23 గ్రాముల ప్రోటీన్లు పొందొచ్చు అని చెప్తున్నారు. గ్రీక్ యోగర్ట్ లో ప్రోటీన్ మరియు ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉంటాయి. గట్ బ్యాక్టీరియాకి కూడా ఇది చాలా మంచిది.

సోయాబీన్స్:

సోయాబీన్స్ కూడా శాకాహారమే. వీటిలో కూడా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. సొయా బీన్ తాలూకా ప్రొడక్ట్స్ అయినా టోఫు, సోయా మిల్క్ వంటి వాటిని కూడా తీసుకొని ప్రోటీన్ పొందొచ్చు. అదేవిధంగా పన్నీర్ లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. చిక్ పీస్ లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల చిక్ పీస్ లో 19 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. శాకాహారులు అధిక ప్రోటీన్ తీసుకోవాలంటే ఈ ఆహార పదార్థాలను డైట్ లో రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండండి. దీంతో మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version