వెస్టిండీస్ తో టీమిండియా టీ 20 మ్యాచ్ ల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. బుధవారం కోల్‌కత్తలోని ఈడెన్ గార్డెన్ వేదికగా మొదటి టీ 20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ లో 1-0 తేడాతో ముందు ఉంది. అయతే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ తో పాటు యువ ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యార్ కు గాయపడ్డారు.
వెస్టిండీస్ ఇన్నింగ్స్ లో 17వ ఓవర్లో టీమిండియా యువ ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యార్ ఫీల్డింగ్ చేస్తూ గాయ పడ్డాడు. అయితే ఇండియా ఇన్నింగ్స్ లో వెంకటేశ్ అయ్యార్ బ్యాటింగ్ కు వచ్చాడు. 13 బంతుల్లోనే 24 పరుగులు చేశాడు. ఒక సిక్స్ తోపాటు 2 ఫోర్లును కూడా బాదాడు. టీమిండియా విజయంలో కీలక పాత్ర వహించాడు. అలాగే వెస్టిండీస్ ఇన్నింగ్స్ లోనే 19వ ఓవర్లో చాహర్ బౌలింగ్ చేస్తున్న సమయంలో విండీస్ కెప్టెన్ పోలార్డ్.. బంతిని బలంగా కొట్టాడు. ఆ బంతి నేరుగా దీపక్ చాహర్ కుడి చేతికి తీవ్రమైన గాయం అయిది.
దీంతో దీపక్ అప్పుడే మైదానాన్ని వీడాడు. తన బౌలింగ్ కోటా పూర్తి కాకముందే.. డ్రెస్సింగ్ రూంకు వెళ్లాడు. ఆ ఓవర్ ను హర్హల్ పటేల్ పూర్తి చేశాడు. కాగ వీరికి స్కానింగ్ చేయనున్నారు. ప్రస్తుతం వీరికి చికిత్స అందిస్తున్నారు. కాగ వీరు రెండో టీ 20 మ్యాచ్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి.