అఫీషియల్: విజయ్ ‘బీస్ట్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

-

కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ నటించిన ‘బీస్ట్’ పిక్చర్ తెలుగులోనూ విడుదలైంది. అయితే, తమిళనాట ఈ చిత్రానికి అనుకున్న స్థాయిలోనే ఆదరణ లభించింది. కానీ, తెలుగు నాట అంతగా ఆకట్టుకోలేకపోయింది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేశారు.

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అనుకున్న అంచనాలను అందుకోలేకపోయిందనే టాక్ కూడా వచ్చింది. హీరో విజయ్ తండ్రి చంద్రశేఖర్ కూడా డైరెక్టర్ ఇంకా స్టోరిపైన కాన్సంట్రేట్ చేయాల్సిందని కామెంట్స్ చేశారు. కాగా, సినిమా సక్సెస్ పట్ల విజయ్ మాత్రం హ్యాపీగానే ఉన్నారు.

ఇటీవల ‘బీస్ట్’ టీమ్ మెంబర్స్ అందిరినీ ఇంటికి పిలిపించి మరీ పార్టీ ఇచ్చారు తలపతి విజయ్. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయ. ఇందులో విజయ్ కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది. డైరెక్టర్ సెల్వరాఘవన్ కీలక పాత్ర పోషించారు.

మేకర్స్ తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఈ నెల 11 నుంచి ఈ పిక్చర్ OTT నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుందని పేర్కొన్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ట్విట్టర్ వేదికగా వచ్చిన ఈ ప్రకటన చూసి నెటిజన్లు , తలపతి విజయ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version