Unstapable చంద్రబాబు షోపై విజయసాయిరెడ్డి వివాదస్పద ట్వీట్

-

Unstapable చంద్రబాబు షోపై విజయసాయిరెడ్డి వివాదస్పద ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ గారిని కాళ్లు పట్టుకుని లాగే ప్రయత్నం కుదరలేదని వెన్నుపోటు పొడిచావా చంద్రం ? అంటూ సెటైర్లు పేల్చారు. దశాబ్దాల తర్వాత ఇప్పుడు టీవీ షోలో గుర్తొచ్చిందా ? అని నిలదీశారు. అబద్దం నీతోనే పుట్టి…నీ జీవితమే అబద్ధమైపోయింది బాబు అంటూ ఆగ్రహించారు విజయసాయిరెడ్డి.

విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి చంద్రబాబు కులమీడియా కాలకూట విషం చిమ్ముతూనే ఉందని నిప్పులు చెరిగారు. సముద్రపు కోతకు గురై అదృశ్యం అవుతుందని ప్రజలను భయ భ్రాంతులకు గురి చేసిందన్నారు. భూ ఆక్రమణలంటూ పెయిడ్ ఆర్టిస్టులతో కొత్త కథలు చెబ్తోంది. ఉత్తరాంధ్ర డెవలప్ కావొద్దంట. ఆ 24 గ్రామాలే కావాలట అంటూ మండిపడ్డారు.

రాము నాయుడు – చందు నాయుడు: ఒక అబద్దం వేయిసార్లు చెప్పినా అబద్దమే కానీ…నిజం ఎప్పటికీ కాదు. ఆలా ఒక అబద్దం నిజమౌతుందని అనుకోవడం ఒక భ్రమ. ఆ భ్రమలో బతికిన వారికి ఏమైందో చరిత్ర చెబుతోంది. అసలు చరిత్రనే నిషేదిద్దామని అనుకునే వారికిది అర్ధం కాదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news