ఇండియా జనాభాలో 26 కోట్ల మంది ‘అమెరికా స్థాయి సంపన్నులు’ – విజయసాయిరెడ్డి

-

ఇండియా జనాభాలో 26 కోట్ల మంది ‘అమెరికా స్థాయి సంపన్నులు’ ఉన్నారని విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. 2023లో ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా ఇండియా అవతరిస్తుందని అంచనా. ఈ సందర్భంగా భారతదేశ ఆర్థిక చరిత్రపై అర్థశాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. మౌర్య చక్రవర్తులైన చంద్రగుప్తుడు, అశోకుడి కాలంలో (క్రీ.శ ఒకటో సంవత్సరం) ప్రపంచ స్థూల వస్తు సేవల ఉత్పత్తిలో (జీడీపీ) ఇండియా వాటా 32 శాతం అని ఆర్థిక చరిత్రకారులు అంచనావేశారు. అప్పుడు ప్రపంచ జనాభాలో మూడో వంతు జనం భారతదేశంలో నివసించేవారట అంటూ పేర్కొన్నారు.

ఇక ప్రస్తుత భారత ఆర్థిక పరిస్థితి పరిశీలిస్తే అనేక సానుకూల అంశాలు కనిపిస్తున్నాయి. గత పదేళ్లలో భారతదేశ వినియోగదారుల మార్కెట్‌ సైజు దాదాపు రెట్టింపు అయి 2.1 లక్షల కోట్ల అమెరికన్‌ డాలర్లకు చేరుకుంది. అంటే 2012 నుంచి ఒక దశాబ్ద కాలంలో వినియోగదారుల మార్కెట్‌ రెట్టింపు అయింది. ప్రపంచంలో పదో అతిపెద్ద వినియోగదారుల మార్కెట్‌ స్థాయి నుంచి నేడు ఇండియా నాలుగో అతిపెద్ద వినియోగదారుల విపణి అయింది. వచ్చే పాతికేళ్లలో దేశ జనాభా మరో 24 కోట్లు పెరుగుతుందని అంచనా. దీని కారణంగా 2047 నాటికి భారత వినియోగదారుల మార్కెట్‌ ప్రస్తుతమున్న సైజుకు 9 రెట్లు పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని అంచనావేస్తున్నారు. అప్పుడు భారత వినియోగదారుల మార్కెట్‌ సైజు 18.5 లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతుంది. మార్కెట్‌ విషయంలో ప్రపంచంలో అమెరికా, చైనా తర్వాత ఇండియా మూడో స్థానం ఆక్రమిస్తుంది. దేశ జనసంఖ్య పెరుగుతున్న కారణంగా వస్తుసేవలకు డిమాండు కూడా పెరుగుతూనే ఉంటుందని తెలిపారు విజయ సాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version