మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి మద్యం కేసులో విచారణ కు హాజరు కావాలంటూ ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది. విజయవాడలో ఉన్న సిట్ కార్యాలయానికి ఈనెల 18వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులలో పేర్కొంది సిట్. ఇప్పటికే ఈ కేసులో విచారణకు రావాలని కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసినా ఆయన విచారణకు హాజరు కాలేదు. తాజాగా విజయసాయి రెడ్డికి సిట్ నోటీసులు జారీ అయ్యాయి. మద్యం కుంభకోణంలో రేపు ఉదయం 10 గంటలకు విచారణకు హాజరవుతున్నారు.
నోటీసుల్లో పేర్కొన్న దానికంటే ఒకరోజు ముందుగానే విచారణకు వెల్లబోతున్నారు. ఈ మేరకు సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు సాయిరెడ్డి. తొలుత ఈనెల 18న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు అయితే తనకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ఉండటంతో 17వ తేదీన విచారణకు వస్తున్నానని సమాచారం పంపించారు విజయసాయిరెడ్డి. ఇక 17వ తేదీన విచారనకు రావాలని.. తాము రెడీ అని విజయసాయికి సిట్ సమాచారం పంపించినట్టు సమాచారం.