వానాకాలం వచ్చినా.. రైతు బంధు, రుణమాఫీ ఉసేలేదని కెసిఆర్ ప్రభుత్వంపై విజయశాంతి ఫైర్ అయ్యారు. తెలంగాణ రైతాంగానికి వానాకాలంలో ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో ఇప్పటికే వానాకాలం సీజన్ షురువైంది. నైరుతి రుతుపవనాల రాకతో తొలకరి వానలు పడుతున్నయి. రైతులు సాగు పనుల్లో బిజీ అయ్యారు. ఇప్పటికే పత్తి విత్తనాలు నాటుతున్నరు. మరో రెండు వానలు పడితే నార్లు పోసేందుకు రెడీ అవుతున్నారన్నారు.
అయితే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఇతర పెట్టుబడుల కోసం మాత్రం తిప్పలు పడుతున్నరు. ప్రభుత్వం, బ్యాంకర్ల తీరుతో టైమ్‌కు క్రాప్ లోన్లు అందక పరేషాన్ అవుతున్నరు. ఇదిలా ఉంటే రైతులకు రూ.లక్ష లోపు క్రాప్లోన్లు మాఫీ చేస్తమని గత ఎన్నికల టైంలో కేసీఆర్ సర్కార్ హామీ ఇచ్చింది. ఏటా రూ.25వేల చొప్పున నాలుగు విడతల్లో రుణ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లిస్తమని పేర్కొన్నది. 2020లో మొదటి విడతలో రూ.25వేల లోపు, 2021లో రెండో విడతలో రూ.50వేల లోపు రుణాలను మాఫీ చేసింది. అది కూడా కొంత మంది రైతులకు మాత్రమే… ఇక రూ.50వేల నుంచి రూ.లక్ష లోపు రుణాల మాఫీ కోసం ఎందరో రైతులు ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
వానాకాలం సీజన్ వచ్చినా ప్రభుత్వం రుణమాఫీ ఊసెత్తకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నరు. కేసీఆర్ సర్కారు రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకర్లు రైతులకు క్రాప్ లోన్లు ఇచ్చేందుకు వెనుకాడుతున్నరు. పాత అప్పు కడితేనే కొత్త లోన్లు మంజూరు చేస్తమని షరతు పెడుతున్నరు. ప్రభుత్వం రుణమాఫీ చేసిన తర్వాత కట్టిన డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామంటున్నరు. కానీ ఆ పైసలు వడ్డీలకే సరిపోతయని రైతులంటున్నరు. మరోవైపు బ్యాంకర్లు రైతులను డిఫాల్టర్ల కింద జమ కడుతున్నరు. ఇలా కేసీఆర్ సర్కార్ రైతులను నిండాముంచుతోందని ఆగ్రహించారు. త్వరలోనే ఈ రైతన్నలు కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు విజయశాంతి.