ప్రధాని మోడీ రాకతో.. టీఆర్‌ఎస్‌ కనుమరుగైపోవడం ఖాయం – విజయశాంతి

-

ప్రధాని మోడీ రాకతో.. టీఆర్‌ఎస్‌ కనుమరుగైపోవడం ఖాయమని హెచ్చరించారు విజయశాంతి. తెలంగాణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీగారి రాకను కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తుండటం విడ్డూరాల్లో కెల్లా విడ్డూరం. కార్మిక, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి అంటూ కమ్యూనిస్టులు పదే పదే చెప్పే ప్రగతి మార్గంలో మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎంతో పురోగతి సాధించిన విషయాన్ని వారు ముందుగా గ్రహించాలన్నారు.


దేశంలో వ్యవసాయ – పారిశ్రామిక రంగాల అభివృద్ధి, ఉద్యోగ కల్పన కోసం రోజ్‌గార్ మేళాలు, ముద్ర లోన్లు, బీమా పథకాలు, స్కిల్ ఇండియా, మేకిన్ ఇండియా, శ్రమయేవ జయతే, అటల్ పెన్షన్, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, ఉజ్జ్వల ప్లాన్ ఇలా అన్ని వర్గాలకూ ప్రత్యేక పథకాలతో మోదీ సర్కారు విస్తృత ప్రజాదరణ సాధించింది. అధికార టీఆరెస్‌ను రోజూ ఒకవైపు తిడుతూనే మొన్నటి మునుగోడు ఉపఎన్నికలో ఎర్రజెండా వదిలేసి గుడ్డిగా గులాబీ జెండా పట్టుకున్న కమ్యూనిస్టులు తెలంగాణలో తమ కార్యకర్తల విశ్వాసాన్ని కూడా కోల్పోతున్నారని ఎద్దేవా చేశారు.

ఇప్పుడు రాష్ట్రంలోకి ప్రధాని రాకను వ్యతిరేకించడం ద్వారా కమ్యూనిస్టులు వారి విలువను మరింతగా తగ్గించుకుంటున్నరు. కార్మికులు, చిరు వ్యాపారులు, చిన్న పరిశ్రమలకు ఊతమిచ్చే పథకాలతో విస్తృత ప్రజాదరణ పొందిన ప్రధాని మోదీగారి తెలంగాణ పర్యటనను నిరసించే ఈ కమ్యూనిస్టుల తదుపరి అడుగు టీఆరెస్‌తో కలసి కనుమరుగైపోయేందుకే అని స్పష్టంగా తెలుస్తోందని హెచ్చరించారు విజయశాంతి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news