తెలంగాణలో భారీగా పత్తి పంట నష్టం.. కేసీఆర్ పై విజయశాంతి ఫైర్

-

కేసీఆర్ పై విజయశాంతి ఫైర్ అయ్యారు.రాష్ట్రంలో పత్తి పంట సాగు చేసిన వేలాది మంది రైతులు వరుస వర్షాలతో పరేషాన్​ అవుతున్నరు. వానాకాలం సీజన్‌లో ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా దాదాపు 7లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతోందని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేశారని నిప్పులు చెరిగారు. అయితే సంగారెడ్డి జిల్లాలో మాత్రమే దాదాపు పూర్తి స్థాయిలో పత్తి సాగు చేయగా… జులై మూడో వారంలో భారీ వర్షాలు కురవడంతో సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో దాదాపు 50 శాతం వరకు మాత్రమే పత్తి సాగైందని మండిపడ్డారు.

అయితే ఇందులో వేలాది ఎకరాల పంట ఇటీవల కురిసిన వర్షాలకు పాడైంది. పంట ఎదుగుదల ఆగిపోయింది. తెగుళ్ల సమస్య కూడా ఉంది. నీళ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండడంతో మొలకలు మురిగిపోతున్నయి. ముసురు కారణంగా కలుపు తీయలేని పరిస్థితి ఉండటంతో వేలాది ఎకరాలు బీడు భూముల్ని తలపిస్తున్నయి. మళ్లీ గత నాలుగు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని ముసురుతో పత్తి పంటపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

ఒక్క ఉమ్మడి మెదక్ జిల్లాలోనే కాదు… తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి ఉంది. తమని ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నప్పటికీ…. కేసీఆర్ సర్కార్ నుంచి కనీస స్పందన కరువైంది. ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపై స్పందించి అన్నదాతలను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నం. రాష్ట్రానికి అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెడుతున్న కేసీఆర్ సర్కార్‌కు రైతాంగం కచ్చితంగా తగిన బుద్ధి చెబుతుందన్నారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news