ఈ మధ్యకాలంలో చాలామంది ఇమ్యూనిటీ పవర్ లేక కరోనా బారిన పడిన విషయం అందరికీ తెలిసిందే. మరి రోగాలను దూరం చేసే అలాంటి రోగనిరోధక శక్తిని పెంపొందించుకొని ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పకుండా కొన్ని పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాలని వైద్యులు చెబుతూ ఉంటారు. ఇక అలాంటి వాటిలో కరక్కాయ కూడా ఒకటి. నిజానికి కరక్కాయ కేవలం దగ్గును మాత్రమే తగ్గిస్తుందని అందరికీ తెలుసు. దగ్గు ఎక్కువగా వచ్చినప్పుడు కరక్కాయ ముక్కను బుగ్గన పెట్టుకొని ఆ రసాన్ని మింగుతూ ఉంటే దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. కానీ కరక్కాయలో ఉండే అసలు సిసలు ప్రయోజనాలు తెలిస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు..
కరక్కాయలో టానిన్స్, ఫాలిఫెనల్ సమృద్ధిగా ఉండడం వల్ల గ్యాస్ సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. ముఖ్యంగా గ్యాస్, అజీర్తి, కడుపులో ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఒక గ్లాస్ మజ్జిగ లో ఒక పావు టేబుల్ స్పూన్ కరక్కాయ పొడిని కలిపి తీసుకుంటే సరిపోతుంది. ఇక ప్రేగు కదలికలను పెంచి సాఫీగా మలవిసర్జనకు సహాయపడతాయి. వీటిలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచే నాలుగు రకాల రసాయన సమ్మేళనాలతో కూడి ఉంటుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ అలాగే యాంటీ వైరల్ లా కూడా పనిచేస్తాయి. ఇకపోతే ప్రేగులో రోగనిరోధక శక్తి సరిగా ఉన్నప్పుడు శరీరం చురుకుగా ఉండడానికి, మంటను తగ్గించడానికి కూడా కరక్కాయలు సహాయపడతాయి.
ప్రేగులో చెడు బ్యాక్టీరియాను నాశనం చేయడానికి ఇందులో ఉండే సమ్మేళనాలు సహాయపడతాయి. ఇక రోగ నిరోధక శక్తిని పెంచి రోగాల బారిన పడకుండా ఈ కరక్కాయ సహాయపడుతుంది. అలాగే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాలను తొలగించి మంచి కొలెస్ట్రాల్ ను పెరిగేలాగా ప్రోత్సహిస్తుంది. ఇక చెడు కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మజ్జిగ తాగడం ఇష్టం లేని వాళ్ళు కరక్కాయ పొడిని నీటిలో వేసుకొని కూడా కలిపి తాగవచ్చు. ఇలా చేస్తే ఈ వర్షాకాలంలో రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.