“గ్రేట్‌ ఆంధ్ర” కు విజయశాంతి వార్నింగ్‌..తప్పుడు ప్రచారం బంద్‌ చేయండి !

-

“గ్రేట్‌ ఆంధ్ర” కు బీజేపీ నేత విజయశాంతి వార్నింగ్‌ ఇచ్చారు. తనపై గ్రేట్‌ ఆంధ్ర రాసిన ఆర్టికల్‌ ట్యాగ్‌ చేస్తూ.. మరిపై ఆ వెబ్‌ సైట్‌ విరుచుకుపడ్డారు రాములమ్మ. తన పై తప్పుడు ప్రచారం చేస్తూ.. రాస్తున్న వార్తలను ఆమె ఖండించారు.

తాను ఎంపీ, ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్నట్లు.. బీజేపీ పార్టీ తరఫున టికెట్‌ కోసం ఆరాటపడుతున్నట్లు.. రాసిన వార్తలు అవాస్తవమని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు.

“అయితే, రాములమ్మకు MP, MLA టికెట్స్ కూడా పోటీ చేసే అవకాశం BJP లో లేదు అని మీరు మళ్లీ news carry చేసుకుంటే అది గౌరవనీయ మీ అభిప్రాయం… అయినా, MP టికెట్ లేని, MLA టికెట్ కు గ్యారంటీ లేని నా వార్తలు posting కన్నా మీరు కూడా వేరే న్యూస్ పెట్టుకోవచ్చు కదండి.. “అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version