ఆంధ్ర ప్రదేశ్ లో కూడా హిజాబ్ వివాదం చెలరేగింది. విజయవాడలోని లయోల కాలేజీలో బుర్ఖా వేసుకువచ్చిన విద్యార్థినిలను కళాశాల యాజమాన్యం లోనికి అనుమతించలేదు. దీంతో వివాదం చెలరేగింది. అయితే ఈ హిజాబ్ వివాదంపై లయోలా కళాశాల యాజమాన్యం స్పందించింది. లయోలా కాలేజ్ ప్రిన్సిపాల్ కిషోర్ మాట్లాడుతూ.. ఇవాళ తరగతిగదిలో ఇద్దరు హిజాబ్ ధరించి వచ్చారని పేర్కొన్నారు.
నేను తరగతి గదులకు రౌండ్ కు వెళ్ళినప్పుడు ఇది గమనించానన్నారు. కళాశాలకు హిజాబ్ ధరించి వస్తున్నారేంటని ప్రశించానని.. తరగతి గదిలో విద్యార్థులు అందరూ యూనిఫామ్ తోనే ఉంటారని వెల్లడించారు. ఇద్దరు విద్యార్థులను పిలిచి మాట్లాడాను..వారి తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చారని చెప్పారు. కళాశాల లో చేరేటప్పుడు ఇక్కడి నిబంధనలు పాటిస్తామని సంతకం చేస్తారని.. కలెక్టర్ ఆదేశాలతో తరగతి గదిలో అనుమతి నించామని వెల్లడించారు. రేపటి నుండి హిజాబ్ ధరించి రావాలా వద్ద అన్న అంశంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.కర్ణాటకలో ‘ హిజాబ్’ వివాదం జాతీయ వ్యాప్తంగా సంచలనంగా మారిందన్న సంగతి తెలిసిందే.