కేసీఆర్ జన్మదినం.. నిరుద్యోగుల ఖర్మదినంగా మారింది. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

కేసీఆర్ జన్మదినం.. నిరుద్యోగులకు ఖర్మదినంగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ పై ట్విట్టర్ లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  కేసీఆర్ జన్మదినం…ప్రతిపక్ష నేతల జైలుదినం కావాలా..? నిరుద్యోగుల తరపున ప్రశ్నించడమే మేం చేసిన నేరమా..? అంటూ ప్రశ్నించారు. ఉద్యోగాల భర్తీకి మెగా నోటిఫికేషన్ డిమాండ్ చేస్తూ అన్నీ మండల కేంద్రాల్లో కేసీఆర్ దిష్ఠిబొమ్మను దగ్ధం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేసీఆర్ తన నీడకు కూడా భయపడుతున్నారని విమర్శించారు. వరుసగా రెండో రోజు సీఎం పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు వీలుగా పోలీసులు అరెస్ట్ చేశారని ఆరోపించారు. నిరుద్యోగ యువత ప్రాణాలు వదులుతున్నారు…ఇది సంబరాలు చేసుకునే సమయమా…? అని ప్రశ్నించారు. 

మరోవైపు టీ కాంగ్రెస్ నేతల అరెస్ట్ లు కొనసాగుతున్నాయి. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కాంగ్రెస్ నీరసనలకు పిలుపునివ్వడంతో ముందస్తు జాగ్రత్తగా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి గోల్కొండ పీఎస్ కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news