కమల్ హాసన్ ‘విక్రమ్’కు దక్కిన మరో అరుదైన గౌరవం..

-

యువ దర్శకుడు లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ కథానాయకుడుగా తెరకెక్కిన చిత్రం ‘విక్రమ్’. వచ్చే నెల 3న విడుదల కానున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో మూవీ యూనిట్ సభ్యులు పాల్గొంటున్నారు. కాగా, ఈ చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ట్రైలర్ ప్రదర్శితం కాగా, ప్రపంచంలోనే పెద్ద స్క్రీన్ అయిన బూర్జ్ ఖలీఫాపైన చిత్ర ట్రైలర్ ను ప్రదర్శించనున్నారు.

ఈ విషయాన్ని డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ ట్వి్ట్టర్ వేదికగా తెలిపారు. జూన్ 1న రాత్రి 8.10 గంటలకు ట్రైలర్ ను బూర్జ్ ఖలీఫాపైన ప్రదర్శించనున్నట్లు ప్రకటించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫజిల్ (ఫఫ), సూర్య కీలక పాత్రలు పోషించారు.

కమల్ హాసన్ ఈ చిత్రంలో నట విశ్వరూపం చూపించారని తెలుస్తోంది. ఈ సినిమాపైన భారీ అంచనాలు అయితే నెలకొని ఉన్నాయి. పాన్ ఇండియా వైడ్ గా మూవీని భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. కమల్ హాసన్ ఈ చిత్రం కోసం దేశంలోని పలు ప్రధాన నగరాలకు వెళ్లి అక్కడ చిత్ర విశేషాలను పంచుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version