భారతదేశానికి స్వాతంత్ర్య వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వా ఆజాదీ కా అమృత్ మహోత్సవం పేరిట ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి శనివారం మధ్యప్రదేశ్ పర్యటనకు వెళ్లారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలలో భాగంగా ఈ నెల 13 (శనివారం) నుంచి 15 (సోమవారం) వరకు దేశ ప్రజలంతా తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగురవేయాలంటూ ‘హర్ ఘర్ తిరంగా’ పేరిట ప్రధాని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
అంతేకాకుండా హర్ ఘర్ తిరంగాలో బాగంగా శనివారం దేశవ్యాప్తంగా తిరంగా బైక్ ర్యాలీకి కూడా కేంద్రం పిలుపునిచ్చింది. ఈ తిరంగా బైక్ ర్యాలీలో పాలుపంచుకునే నిమిత్తం మధ్యప్రదేశ్ పర్యటనకు వెళ్లిన కిషన్ రెడ్డి… ఆ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం ఖజురహో వెళ్లారు. చారిత్రక పట్టణంలో బీజేపీ శ్రేణులు, స్థానిక ప్రజలతో కలిసి ఆయన బైక్ ర్యాలీలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన బుల్లెట్ బండి ఎక్కి ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు.
Joined the ‘Tiranga Bike Rally' as part of the #HarGharTiranga campaign in Khajuraho, Madhya Pradesh.
Traversing through the green fields and by-lanes, the rally saw soaring patriotic fervour all along.#AmritMahotsav pic.twitter.com/2dyqlPKJar
— G Kishan Reddy (@kishanreddybjp) August 13, 2022