యుద్ధం ‘వెన్నెల’కు ప్రాణం పోసింది..‘విరాటపర్వం’ ట్రైలర్ రివ్యూ..

-

‘విరాట పర్వం’ సినిమా విడుదల కరోనా మహమ్మారి వలన చాలా సార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ నెల 17న ఈ సినిమా విడుదల కాబోతున్నది. ఈ క్రమంలోనే తాజాగా మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

‘నీది నాది ఒకే కథ’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమై తనకంటూ ఓ సొంత దారి వేసుకున్నారు దర్శకుడు వేణు ఊడుగుల. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘విరాట పర్వం’ యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందింది. నక్సలిజం నేపథ్యంగా వస్తున్న ఈ సినిమాలో లవ్ స్టోరిని చాలా చక్కగా చూపించినట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది.

‘సామ్యవాద పాలననే స్థాపించిగ ఎన్నినాళ్లు..’ అంటూ కామ్రేడ్ రవన్న పాత్రలో రానా చెప్తున్న ఇంటెన్స్ డైలాగ్స్ సమాజ కాంక్షను తెలుపుతున్నాయి. ఇక వెన్నెల పాత్రలో సాయిపల్లవి ఇట్టే ఒదిగిపోయింది. ‘అరణ్య’ పుస్తకం రాసిన రవన్నను చూపిస్తే ‘కోడిని కోసి కల్లు శాక పోస్త..’ అంటూ పెద్దమ్మను మొక్కుకున్న తీరు రియాలిటీకి చాలా దగ్గరగా ఉంది.

ఇక ‘‘రవన్న దళం..వచ్చిందిరా..’’ అంటూ చెప్పే డైలాగ్స్.. వ్యవస్థపై నక్సలైట్ల యుద్ధం చాలా చక్కగా చూపించారు. ప్రజల కోసం నక్సలైట్ల నిలబడ్డ సంగతులను చాలా బాగా చూపించారు. రాహుల్ రామకృష్ణ చెప్తున్న డైలాగ్ కూడా ఆకట్టుకుంటోంది. కామ్రేడ్ రవన్న అడవి మధ్యలో ఉండి గెరిల్లా వార్ చేసినట్లు చూపించడంపై ప్రేక్షకుల్లో ఆసక్తి రేపినట్లుంది. ఇక సాయిపల్లవి, రానా మధ్య ప్రేమకు సంబంధించిన మాటలు చాలా చక్కగా ఉన్నాయి.

ఊపిరికి ఊపిరికి మధ్య ఊపిరి సలపని యుద్ధం..ఉంటుందంటూ రానా చెప్పడం, చావుకేక తనకూ తెలుసంటూ సాయిపల్లవి మాటలు, రక్తపాతం లేనిది ఎక్కడా? మనిషి పుట్టుకలోనే రక్తపాతం ఉందంటూ నవీన్ చంద్ర చెప్పే మాటలు విశేషంగా జనాలను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ట్రైలర్ చివరలో యుద్ధం తనకు ప్రాణం పోసిందని చెప్తూ..వెన్నెల ఇది తన కథ అని చెప్పడం చాలా బాగుంది. సురేశ్ బొబ్బిలి అందించిన మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా నిలవబోతున్నదని స్పష్టమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news