విశాఖ మేయర్ పీఠం వైసీపీ కైవసం

-

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ పార్టీ జోరు కొనసాగుతోంది. వైసీపీ పార్టీ తరుపున పోటీ చేసిన అభ్యర్ధులు విజయకేతనం ఎగురవేస్తున్నారు. ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న కాబోయే ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖలోను విజయోత్సవ సంబరాలు మొదలయ్యాయి. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలే ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుకు ప్రధాన కారణమని, ప్రజలు తమపై ఉంచిన నమ్మకంతో గెలుపు సొంతమైందని పార్టీ మంత్రులు అన్నారు. 

ఇక గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం వైసీపీ కైవసం చేసుకుంది. వైసీపీ ముందు నుంచి స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తూ వచ్చింది. ఈ  విశాఖ కార్పొరేషన్ లో కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం లభించింది. 58 స్థానాల్లో వైసీపీకి స్పష్టమైన ఆధిక్యం లభించింది. అలానే 30 స్థానాలని టీడీపీ గెలుచుకుంది. జనసేన 3, బీజేపీ 1, సీపీఐ 1, సీపీఎం 1 స్థానాలు గెలుచుకోగా ఇండిపెండెంట్లు 4 స్థానాలు గెలుచుకున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news