పవిత్రతో వ్యవహారంపై నరేష్ ను మందలించిన సూపర్ స్టార్ కృష్ణ?

-

గత కొద్ది రోజులుగా సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ ల గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. గతంలో వీరు సహజీవనం చేస్తున్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే అవే వార్తలు నిజమయ్యాయి. వీరిద్దరూ నరేష్ భార్య రమ్య రఘుపతి కి మైసూరులోని ఓ హోటల్లో పట్టుబడ్డారు. దీంతో వీరు నిజం చెప్పక తప్పలేదు.

తాము సహజీవనం చేస్తున్నామనే విషయాన్ని బహిరంగంగానే అంగీకరించారు. నరేష్ భార్య అయిన రమ్య రఘుపతి తన భర్త నరేష్ పై న్యాయపోరాటం చేస్తానని తెలియజేసింది. తనను గన్నుతో బెదిరించి తన నుంచి విడాకులు తీసుకోవాలని చూస్తున్నాడని ఆరోపించింది. అయితే నరేష్ వ్యవహారంపై సూపర్ స్టార్ కృష్ణ అసంతృప్తిని వ్యక్తం చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి సూపర్ స్టార్ కృష్ణ ఇలాంటి వివాదాలకు దూరంగానే ఉంటారు. కానీ నరేష్ వల్ల కృష్ణ పేరు కూడా బయటకు వచ్చింది.

ఆయనకు తెలిసే తాము ఇలా చేస్తున్నామని పవిత్రా లోకేష్ కూడా చెప్పింది. దీంతో కృష్ణ తన పేరు అలా బయటకు రావడాన్ని సహించలేకపోతున్నారట. నరేష్ ను ఈ విషయమై ఆయన మందలించారని, అనవసరంగా ఫ్యామిలీ పేరు చెడగొడుతున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇది మీడియాలో జరుగుతున్న ప్రచారమే.. ఇందులో నిజం ఎంత ఉంది అనే విషయం తేలాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news