వాల్తేరు వీరయ్య ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహుర్తం ఫిక్స్

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజు రవితేజ చాలాకాలం తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై వాల్తేరు వీరయ్య సినిమాలో మెరవబోతున్నారు. అన్నయ్య సినిమాలో మెరిసిన ఈ క్రేజీ కాంబినేషన్ మళ్ళీ సందడి చేసేందుకు రెడీ అవుతోంది.

చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్యలో రవితేజ కీలకపాత్రలో కనిపించనున్నారు. రవితేజ ఇందులో ఏసీపీ విక్రమ్ సాగర్ పాత్రలో కనిపిస్తున్నాడు.రవితేజ ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పటికే సోషల్ మీడియా లో హల్చల్ చేస్తోంది.

అయితే, తాజాగా ఈ సినిమా నుంచి బిగ్‌ అప్డ్‌ డేట్‌ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌, ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కు ముహుర్తం ఫిక్స్‌ చేసింది చిత్ర బృందం. రేపు ఈ సినిమా ట్రైలర్‌, ఎల్లుండి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరుగనుంది. ఈనెల 8న ఆర్కే బీచ్‌లో జరగాల్సి ఉన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుందని అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news