నేడే చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్

-

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖ ఏయు ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో ఇవాళ జరగనుంది. ఈ వేడుకను తోలుత ఆర్కే బీచ్ రోడ్ లో నిర్వహించాలని నిర్ణయించారు.

అయితే ఆదివారం సాయంత్రం బీచ్ రోడ్డుకు సందర్శకులు భారీగా వస్తారని, ట్రాఫిక్ సమస్యలు వస్తాయని పోలీసులు తెలిపారు. దీంతో ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో వేడుకను నిర్వహిస్తున్నారు. ఈనెల 13న ఈ మూవీ రిలీజ్ కానుంది.

కాగా, మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కింది వాల్తేరు వీరయ్య. మెగాస్టార్ చిరంజీవి – మాస్ మహారాజ రవితేజ చాలా కాలం తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై మెరవబోతున్నారు. అన్నయ్య సినిమాలో మెరిసిన ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ సందడి చేసేందుకు రెడీ అయింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version