గురక ఎక్కువ వస్తోందా..? ఇలా కంట్రోల్ చేసుకోండి..!

-

చాలా మందికి ఎక్కువగా గురక వస్తుంది. గురక కారణంగా పక్క వారి నిద్ర పాడవుతుంది గురక సమస్య నుండి బయట పడటం కొంచెం కష్టమే కానీ ఈ చిట్కాలను కనుక మీరు ఫాలో అయ్యారంటే ఈజీగా ఈ సమస్య నుండి బయట పడొచ్చు. గురక నుండి బయట పడాలంటే ఇలా చేయండి. చాలామంది ఈ రోజుల్లో గురక పెడుతున్నారు పడుకున్న తర్వాత మనం తీసుకునే శ్వాస నోటి నుండి వస్తే గురక అంటారు. గురక వలన పక్క వాళ్ళ నిద్ర పాడవుతుంది మనకి కూడా ఎంత శబ్దం పెడుతున్నాము అనేది తెలీదు.

అసలు గురక ఎందుకు వస్తుంది..? ఈ గురక రావడానికి కారణం ఏంటంటే.. సరైన నిద్ర లేక పోవడం, సమయానికి భోజనం చేయకపోవడం, స్థూలకాయం, సరిగ్గా పడుక్కోకపోవడం వలన గురక సమస్య వస్తుంది. పడుకున్న తర్వాత మనకి తెలియకుండానే గురక వస్తుంది. గురకని దూరం చేయడానికి చూసుకోవాలి.

గురకని నివారించే మార్గాల విషయానికి వస్తే.. కనీసం ఎనిమిది గంటల పాటు నిద్ర ఉండాలి. గొంతు నాలుక కండరాలు బలోపేతం చేసుకోవాలి. పడుకునే ముందు ఎక్కువ నీరు తాగడం వలన కూడా గురక త్వరగా తగ్గుతుంది ప్రతి రోజు ఉదయం 20 నిమిషాల యోగ చేస్తే కూడా గురక సమస్య నుండి బయటపడొచ్చు. ఏది ఏమైనా మన ఆరోగ్యం బాగుండాలంటే సరైన విధానం మంచి ఆరోగ్యకరమైన పద్ధతిని పాటించాలి. అయితే సరైన జీవన విధానం ని అనుసరిస్తూ ఈ విషయాలని గుర్తుపెట్టుకుంటే గురక సమస్యకు చెక్ పెట్టొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version