గత ప్రభుత్వం పెట్టిన రూ.717 కోట్ల బకాయిలను కూడా మేమే చెల్లించాం: వైయస్ జగన్

-

శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి లో వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో రాయలసీమ కరువు సీమ అని, అనంతపురం కు ఎడారి జిల్లా అనే పేరు ఉండేది అని.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని జగన్ అన్నారు. గతంలో పంట బీమా ఎప్పుడు వస్తుందో లేదో తెలియని పరిస్థితులు ఉండేవని.. కానీ ఇప్పుడు మాత్రం ఏ సీజన్లో నష్టం జరిగితే ఏడాదిలోపే నేరుగా రైతుల చేతుల్లోకి భీమా వచ్చే మార్పులు తీసుకొచ్చామని జగన్ అన్నారు.

గత ప్రభుత్వ పాలనలో ఐదేళ్లకు కలిపి పంట బీమా కింద 38 లక్షల 85 వేల మంది రైతులకు రూ.3,411 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. ఇప్పుడు తమ హయాంలో మూడేళ్లలో 44 లక్షల 28 వేల మంది రైతులకు రూ.6,685 కోట్లు ఇచ్చామని జగన్ తెలిపారు. గత ప్రభుత్వం పెట్టిన రూ. 717 కోట్ల బకాయిలను కూడా తామే చెల్లించామన్నారు. రైతులకు అన్ని రకాలుగా మేలు చేస్తున్నామని గర్వంగా చెబుతున్నామన్నారు. రైతులకు మంచి చేసే విషయంలో దేశం తోనే పోటీ పడుతున్నామని జగన్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news