డ్రగ్ ఫ్రీ స్టేట్ మార్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాము : అస్సాం సీఎం

-

మత్తు పదార్థాలపై అస్సాం ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోంది. డ్రగ్స్, గంజాయి, అక్రమ మద్యం రవాణా, స్మగ్లింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి హిమాంత బిస్వా శర్మ అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు ఎక్కిడిక్కకడ తనిఖీలు చేసి పెద్ద ఎత్తున డ్రగ్స్, గంజాయి, అక్రమ మద్యం పై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు స్వాధీనం చేసిన రూ.2100 కోట్ల విలువ చేసే డ్రగ్స్, అక్రమ మద్యాన్ని ముఖ్యమంత్రి హిమాంత బిస్వా శర్మ ధ్వంసం చేశారు.స్వయంగా రోడ్డు రోలర్ నడిపి మద్యం బాటిళ్లు, డ్రగ్స్‌ను ముఖ్యమంత్రి ధ్వంసం చేశారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లా వైరల్ గా మారింది.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి బిస్వా శర్మ మాట్లాడుతూ.. అస్సాంను డ్రగ్ ఫ్రీ స్టేట్ మార్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామని అన్నారు. ఎవరైనా రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి, అక్రమ మద్యం సరఫరా చేస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. మాదకద్రవ్యాల ముప్పులేకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించే డ్రగ్ రహిత రాష్ట్రం అస్సాంను తీర్చిదిద్దుతామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version