ఒక్కో కుటుంబానికి 3200 పరిహారం చెల్లిస్తాం – హరీష్ రావు

-

మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. జిల్లాలో 370 గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి అని తెలిపారు. ఒక్కొక్కరికి 3200 పరిహారం చెల్లిస్తామని తెలిపారు మంత్రి. జిల్లాలో చెరువులు పూర్తిగా నిండాయని, పోచారం ప్రాజెక్టు చెరువులోకి ప్రజలు వెళ్లకుండా పోలీసులు, రెవెన్యూ అధికారులను అలేర్ట్ చేశామని చెప్పారు. రాబోయే వర్షాలకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తొండి ఆట ఆడిన ప్రతి గింజనూ కొనుగోలు చేశామన్నారు. బీజేపీ నాయకులు బియ్యం తీసుకుంటామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారని, నూకల నష్టాన్ని మేమే భరిస్తాం అనీ బియ్యాన్ని ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేంద్రంలోనీ బిజెపి ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని మండిపడ్డారు.

వడ్లు ఉంటామని చెప్పిన బీజేపీ నేతల గొంతు ఎందుకు మూగబోయింది అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతు బంధు 7500 ఇచ్చిన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అని కొనియాడారు. తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. వడ్లు కొంటారా కొనరా అని బిజెపి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేయాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news