ఆధార్ కార్డు హోల్డర్స్‌కు కేంద్రం తీపి కబురును అందించింది. యూఐడీఐ కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకువచ్చింది. కొత్త యాప్‌ను ఆవిష్కరించింది. దీని పేరు ఆధార్ ఫేస్ ఆర్‌డీ ఈ యాప్ ఆధారంగా సాయంతో ఆధార్ కార్డు హోల్డర్లు ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా ఫేస్ అథంటికేషన్ పూర్తి చేసుకోవచ్చు. అంటే యాప్ ఉంటే చాలు ఫోన్ ద్వారా మీరు ఫేస్ స్కానింగ్‌తో అథంటికేషన్ పూర్తి చేసుకోవచ్చు. దీంతో చాలా మందికి ప్రయోజనం కలుగనుంది. పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు.
ప్రజలు ఇకపై ఆధార్ అథంటికేషన్ ఫీచర్ ఉపయోగించొచ్చు. దీని కోసం యూఐడీఏఐ ఆర్‌డీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. జీవన్ ప్రమాణ్, పీడీఎస్, స్కాలర్‌షిప్ స్కీమ్స్, కోవిన్, ఫార్మర్ వెల్ఫేర్ స్కీమ్స్ వంటి వాటికి ఉపయోగించుకోవచ్చు’ అని యూఐడీఏఐ ట్వీట్ చేసింది. ఆధార్ కార్డు కలిగిన వారి ఆధార్ నెంబర్లు, ఇతర డెమొగ్రాఫిక్ లేదా బయోమెట్రిక్ డేటాను ఫేస్ అథంటికేషన్ కోసం సెంట్రల్ ఐడెంటిటీ డేటా రెపోజిటరీలో స్టోర్ చేసుకోవచ్చు. యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ విషయం గురించి వెల్లడించింది..
ఫేస్ ఆర్‌డీ యాప్‌లోకి ఎలా లాగిన్ అవ్వాలి?
* గూగుల్ ప్లేస్టోర్‌లోని వెళ్లి ఆధార్ ఫేస్ ఆర్‌డీ యాప్‌లోకి సెర్చ్ చేయాలి. తర్వాత ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
* మీరు ఫేస్ అథంటికేషన్ పూర్తి చేసుకోవడానికి స్క్రీన్‌పై కనిపిస్తున్న నిబంధలను తెలుసుకోండి. తర్వాత ప్రోసీడ్‌పై క్లిక్ చేయాలి.
* ఫేస్ అథంటికేషన్ సక్సెస్‌ఫుల్ అవ్వాలంటే మీరు లైటింగ్ ఉన్న చోట నిలుచుంటే ఉత్తమం. అలాగే బ్యాక్‌గ్రౌండ్ కూడా క్లియర్‌గా ఉండేలా చేసుకోండి. అలాగే కెమెరా లెన్స్ కూడా క్లీన్ చేయండి.
ఆధార్ కార్డు కలిగిన వారి ఐడెంటిటీని గుర్తించడానికి ఫేస్ అథంటికేషన్ ఫీచర్ కూడా ఉపయోగించొచ్చని యూఐడీఏఐ తెలిపింది. ఫేస్ అథంటికేషన్ అంటే యాప్ మీ ఫేస్ స్కాన్ చేస్తుంది. ఇలా స్కాన్ చేసిన డేటా మీరు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సమయంలో ఇచ్చిన ఫేస్ డేటాకు సరిపోవాలి..లేదంటే మాత్రం మీది ఫెక్ నెంబర్ అని గుర్తించవచ్చు..