హైదరాబాద్‌లో అంతార్జాతీయ సంస్థ వెబ్ పీటీ.. 150 కోట్లతో గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్‌

-

మరో అంతర్జాతీయ సంస్థ హైదరాబాద్ లో వ్యాపార కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఔట్ పేషెంట్ రీహాబిలిటేషన్ థెరపీకి అవసరయ్యే సాఫ్ట్ వేర్ సేవలను అందించడంలో అంతర్జాతీయంగా పేరున్న వెబ్ పీటీ సంస్థ హైదరాబాద్ లో తన గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్ (GCC) ని ఏర్పాటుచేస్తుంది. కండరాలు, ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడే రోగులకు మరింత మెరుగైన పద్దతుల్లో రీహాబిలిటేషన్ థెరపీని అందించడానికి వైద్య సంస్థలకు అవసరమయ్యే ఎండ్ టు ఎండ్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్ ను వెబ్ పీటీ సాఫ్ట్ వేర్ అందిస్తుంది. 2008 లో అమెరికాలోని ఫీనిక్స్ కేంద్రంగా ప్రారంభమైన వెబ్ పీటీ సాఫ్ట్ వేర్ కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుంది.

వెబ్ పీటీ సీఈఓ ఆష్లే గ్లోవర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పాల్ షుగా, సమ్మిట్ కన్సల్టింగ్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు, సీఈఓ సందీప్ శర్మ లు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే. తారక రామారావు, ఐటీ,పరిశ్రమల ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి ఎం నాగప్పన్‌తో దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో సమావేశయ్యారు. తమ విస్తరణ ప్రణాళికలను చర్చించారు.

రీహాబిలిటేషన్ థెరపీని మరింత సులభతరం చేయడమే వెబ్ పీటీ లక్ష్యం అని CEO ఆష్లే గ్లోవర్ అన్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఇండియాలో తన వ్యాపార విస్తృతిని పెంచుకునే వ్యూహంలో భాగంగా గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. కండరాలు, ఎముకలకు సంబంధించిన వ్యాధులతో బాధపడే రోగులకు అందించే రీహాబిలిటేషన్ థెరపీకి మరింత సాధికారత కల్పించే లక్ష్యంగా హైదరాబాద్ కేంద్రం పనిచేస్తుందని ఆష్లే స్పష్టం చేశారు.
150 కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో గ్లోబల్ కేపబిలిటీస్ కేంద్రం ఏర్పాటు చేస్తున్న వెబ్ పీటీకి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. వెబ్ పీటీ విజయాల్లో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామిగా ఉంటుందని హామి ఇచ్చారు. ప్రతిభావంతమైన మానవవనరులు, సమర్థ, సుస్థిర ప్రభుత్వం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కలిగిన నగరం అయినందునే తమ గ్లోబల్ కెపబిలిటీస్ సెంటర్ ను వెబ్ పీటీ హైదరాబాద్ లో ఏర్పాటుచేస్తోందన్నారు. లైఫ్ సైన్సెస్ హబ్ ఆఫ్ ఆసియాగా హైదరాబాద్ ఎదుగుతున్న వైనానికి ఇది మరో నిదర్శనం అన్నారు.

గ్లోబల్ కెపాబిలిటీస్ సెంటర్‌ ఏర్పాటు కోసం వెబ్ పీటీ తో కలిసి పనిచేస్తున్నామని సమ్మిట్ కన్సల్టింగ్ సర్వీసెస్ సీఈఓ సందీప్ శర్మ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం, కార్యకలాపాల నిర్వహణలో ప్రతిభావంతమైన మానవవనరులను ఆకర్షించడంలో సమ్మిట్ కన్సల్టింగ్ సర్వీసెస్ సహాయపడుతుందన్నారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ గురించి మరిన్ని వివరాల కోసం, దయచేసి https://lifesciences.telangana.gov.in/ని చూడండి. WebPT గురించి మరింత సమాచారం కోసం, దయచేసి www.webpt.comని సందర్శించండి.
webpt investing in hyderabad

Read more RELATED
Recommended to you

Latest news