మహమ్మారి సమయంలో బరువు పెరిగారా..? అయితే ఇలా తగ్గండి..!

-

కరోనా మహమ్మారి సమయంలో అందరూ ఇంటికే పరిమితం అయిపోయారు. దానితో ఇంట్లోనే కూర్చోవడం, ఎక్కువ కదలకుండా ఒకే దగ్గర ఉండడం ఇలా చాలా మార్పులు వచ్చాయి. దీంతో చాలా మంది బరువు కూడా పెరిగి పోయారు. అయితే ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కరోనా తగ్గుతోంది. కరోనా మహమ్మారి సమయంలో పెరిగిపోయిన బరువును సులభంగా తగ్గించుకోవడానికి ఈ ప్రయత్నాలు చేయండి. అయితే మరి ఆరోగ్యకరంగా బరువు ఎలా తగ్గాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం.

సరైన ఆహారం తీసుకోవడం:

బరువు తగ్గాలని అసలు తినడం మానేయడం లేదా చాలా తక్కువ తినడం మంచిది కాదు. అలా అని అతిగా తినడం కూడా మంచిది కాదు. మీరు తినేటప్పుడు అన్ని క్యాలరీలు మీకు అందుతున్నాయో లేదో చూసుకోండి. మీ వయసును బట్టి ఎన్ని క్యాలరీలు తీసుకోవాలో చూసుకోండి ఇలా అన్ని పూటలా సరైన కేలరీలు అందేటట్టు చూసుకోండి.

ఎక్కువ ఫైబర్ తీసుకోండి:

ఎక్కువ ఫైబర్ తీసుకోవడం మంచిది. ఎక్కువగా పండ్లు, కూరగాయలలో ఇది ఉంటుంది. ఇది డైజెస్టివ్ హెల్త్ కి మంచిది. అలానే కాన్స్టిపేషన్ సమస్య కూడా రాకుండా చూసుకుంటుంది.

యాక్టివిటీకి సమయాన్ని ఇవ్వండి:

వీలైనంత ఎక్కువ సేపు వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. అలాగే ఒత్తిడి కూడా వ్యాయామం ద్వారా తగ్గుతుంది. కొవ్వుని కూడా వ్యాయామం చేసి కరిగించుకోవచ్చు. కాబట్టి వ్యాయామం చాలా ముఖ్యం.

నీళ్లు ఎక్కువగా తాగండి:

నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అలానే మీరు జ్యూస్లు, కొబ్బరి నీళ్లు కూడా తీసుకోవచ్చు. ఇలా డిహైడ్రేషన్ సమస్య రాకుండా జాగ్రత్త పడవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version