తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి స్వల్పంగా గాయాలు అయ్యాయట. సీఎం ఒక పర్యటన నిమిత్తం హెలికాఫ్టర్ లో బయలుదేరింది, కానీ మార్గం మధ్యలో వాతావరం సరిగా లేకపోవడంతో ప్రయాణం చేయడం మంచిది కాదని భావించి వెనుకకు రావడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రయత్నంలో వారికి దగ్గర్లోని సిలిగురి సెవోక్ ఎయిర్ బేస్ లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యారు. అయితే ల్యాండ్ అయిన క్రమంలో హెలికాప్టర్ కుదుపునకు గురి కావడంతో మమతాబెనర్జీకి శరీర వెనుక భాగంలో మరియు మోకాలికి స్వల్పంగా గాయాలు అయ్యాయి. వెంటనే ఆమెను కోలకతా లోని SSKM హాస్పిటల్ లో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం మమతా ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు మరియు అధికారులు చెబుతున్నారు. ఈమెకు రెండు మూడు రోజులు విశ్రాంతి అవసరం అని డాక్టర్లు చెప్పినట్లు సమాచారం.