భ‌ద్ర‌త బాధ్య‌త ఏది గొప్ప‌ది ?

-

సంద‌ర్భం : నేడు ప్రపంచ భ‌ద్ర‌తా దినోత్స‌వం

సామాజిక బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించే క్ర‌మాన మ‌నుషులు ఎవ‌రికి వారే ఉంటారు. క‌నుక వాళ్ల‌ను దూరం పెడుతూ జీవించండి. ప్ర‌పంచ ధోర‌ణుల‌ను త‌మ స్వార్థానికి అనుగుణంగా మార్చేద్దాం అని అనుకునే క్ర‌మాన కొంద‌రు ఎవ‌రికి వారే ఉంటారు. అలాంటి వారికి కూడా దూరంగా ఉంటూ గ‌డ‌పండి. మీ జీవితాల్లో బాధ్య‌త‌లే ముఖ్యం.. వాటితోపాటు వాటి నిర్వ‌హ‌ణ‌కు దోహదం అయిన సామాజిక దృక్ప‌థంను అర్థం చేసుకోవ‌డం కూడా ముఖ్యం. ముందున్న కాలంలో ఎటువంటి ఆటుపోట్లూ లేని జీవితంను అనుభ‌వించాలంటే కొన్ని స‌వాళ్ల‌ను స్వీక‌రించ‌డం నేర్చుకోండి. అది బాధ్య‌త‌ల్లో భాగం. ఉద్యోగ జీవితంలోనో లేదా వ్య‌క్తిగ‌త జీవితంలోనో ఓ భాగం త‌ప్ప‌క కాగ‌ల‌దు. అయినా భ‌రించండి. ఏం కాదు.. మీరు ప‌నిచేసే చోట నుంచి భ‌వ్య‌మ‌యిన కాలాన్ని ఆశించండి.. అదే మీ గెలుపు. అవును భ‌ద్ర‌త‌తో కూడిన రేప‌టి కాలానికి ఇప్ప‌టి నుంచి స‌న్న‌ద్ధ‌త ఓ ప్రామాణికం కావాలి.

అభ‌ద‌త్ర‌త‌ను అమెరికా లాంటి దేశాలు దూరం చేసుకుని తీరాలి. అప్పుడు ప్ర‌పంచంలో కొంత ఆయుధ వినియోగం త‌గ్గుతుంది. దూరం చేసుకోవ‌డం ఓ విధంగా బాధ్య‌త. దూరం కావ‌డం అన్న‌ది విధి. విధి రాత‌లో కూడా బాధ్య‌తల నిర్వ‌హ‌ణే ప్ర‌థ‌మ ప్రాధాన్యం వ‌హిస్తాయి. అగ్ర భాగాన నిలుస్తాయి. క‌నుక మీ మీ జీవితాల్లో అంద‌మ‌యిన క్ష‌ణాలు కొన్న‌యినా ఉండాలంటే, నిర్వ‌ర్తించాల్సిన బాధ్య‌త‌లు అన్న‌వి స‌క్ర‌మంగా స‌కాలంలో పూర్తి చేయ‌డం ఓ ప్ర‌థమ ప్రాధాన్యం కావాలి. విభిన్న నిర్ల‌క్ష్యాల‌ను వీడి, ప్ర‌వ‌ర్తించాలి.
ప్ర‌యాణించాలి కూడా ! ప‌నిచేసే చోట భ‌ద్రంగా ఉండ‌డం నేర్చుకోండి. ప్రయాణంలో బాధ్య‌త‌తో న‌డ‌వ‌డి సాగించ‌డం నేర్చుకోండి. ప్ర‌మాదాల నివార‌ణ‌కు భ‌ద్ర‌త‌తో కూడిన కొన్ని ప‌నులు త‌ప్ప‌క చేయండి. ప‌నిచేసే చోట అయినా లేదా నివ‌సించే చోటు అయినా సామాజిక బాధ్య‌త అన్న‌ది అస్స‌లు మ‌రువొద్దు. ఇదే మీ జీవితానికి ఒక అంతిమ నిర్ణ‌యం కావాలి. నినాదం అయి ఉంటే మేలు.

ప‌నిచేసే చోటు భ‌ద్ర‌త ఉండాలి. ప‌ని చేయించుకునే వారికి బాధ్య‌త‌లు తెలిసి ఉండాలి. కుటుంబానికి ఓ ఆర్థిక భ‌ద్ర‌త కావాలి. అదే విధంగా కుటుంబ పెద్ద బాధ్య‌త‌ల‌ను వ‌దిలి ఉండ‌కూడ‌దు. మంచి చ‌దువు ఆర్థిక భ‌ద్ర‌త‌ను ఇస్తుంది. ఉద్యోగం జీవితం భ‌వ్య‌మైన కాలాన్ని పరిచ‌యం చేస్తుంది. క‌నుక ఎవ‌రికి వారు ఈ ప్ర‌పంచాన్ని అర్థం చేసుకునే తీరే అతి ముఖ్యం. ఇందులో ఎవ‌రికి వారు ప్ర‌త్యేకం కావొచ్చు.. సామాన్యమూ కావొచ్చు. స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే ఓ ప‌ర‌మావధిగా చేసుకుని జీవించ‌డంలో ఆనందం ఉంది.
స‌వాళ్ల‌ను స్వీక‌రించి కుటుంబాన్నీ, చుట్టూ ఉన్న స‌మాజాన్నీ అత్యంత ప్ర‌భావితం చేయ‌డంలో బాధ్య‌త ఉంది.దేశాల అధ్య‌క్షుల‌కూ, ప్ర‌పంచ నాయ‌కుల‌కూ కావాల్సింది ఇదే !

మీ బిడ్డ‌లు మీ జీవితం ఇవ‌న్నీ బాగుండాలి. ఇవ‌న్నీ బాగుండేందుకు మీ మీ ఆలోచ‌న‌లు కూడా బాగుండాలి. ఆలోచ‌న బాగుంటే ఓ మ‌నిషి స‌మాజంలో ఉన్న‌త స్థాయికి త‌న‌కు తెలియ‌కుండానే చేరుకుంటాడు. త‌న ప్ర‌మేయంతో సంబంధం లేకుండానే ఉన్న‌తిని పొంది కుటుంబాన్ని భ‌ద్ర‌మైన జీవ‌న గ‌మ‌నంలోకి తీసుకువెళ్తాడు. అందుకే భ‌ద్ర‌మ‌యిన జీవితం ఆడ బిడ్డ‌ల‌కు ఇవ్వండి.. భ‌ద్ర‌త‌తో పాటు బాధ్య‌త‌లు కూడా మీ బిడ్డ‌ల‌కు నేర్పండి. ఈ రెండూ మంచి దిశ‌గా న‌డిపిస్తాయి. చెడును సంహ‌రిస్తాయి. గొప్ప ఫ‌లితాల‌కు ఆన‌వాలుగా నిలిచి ఉంటాయి.

జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు దాటి వ‌చ్చి ఉంటాం. జీవితాన్ని మ‌న ద‌గ్గ‌ర నుంచి లాక్కొని లేదా గుంజుకుని మాట్లాడిన వారూ ఉంటారు. అస‌లు అవేవీ ప‌ట్ట‌కుండా త‌మ బాధ్య‌త‌ల‌ను నెర‌వేర్చిన వారూ ఉంటారు. కనుక భ‌ద్ర‌త ముఖ్యం. బాధ్య‌త ఇంకా ముఖ్యం. ఎన్నో బాధ‌లు చ‌వి చూస్తున్న ప్ర‌పంచానికి ఈ రెండూ ఇవాళ్టి అవ‌స‌రాలు. వీటిని దాటుకుని ప్ర‌యాణించ‌డం క‌ష్టం కూడా !

Read more RELATED
Recommended to you

Exit mobile version