స్నేహ దంపతుల సంపాదన ఏ రేంజ్ లో ఉందంటే..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ స్నేహ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకొని టాప్ హీరోయిన్గా కొనసాగుతూ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేస్తూ దూసుకుపోతోంది. నటీనటులు ఫామ్ లో ఉన్నప్పుడే పారితోషకం విషయంలో బాగా డిమాండ్ చేస్తారు. అంతేకాదు అప్పుడే యాడ్స్ లో చేస్తూ రెండు చేతులా సంపాదన తెచ్చుకుంటారు. ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వెండితెర మీద సత్తా చాటుతూ యాడ్స్ కూడా చేస్తున్న వారిలో నటి స్నేహ కూడా ఒకరు.

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా అగ్ర హీరోల సరసన నటించిన స్నేహ.. పెళ్లయ్యాక ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే మరొకవైపు ఆమె భర్తతో కలిసి పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తోంది. ఇప్పటివరకు స్నేహ ఆమె భర్త ప్రసన్నకుమార్ ఇద్దరూ కలసి కంఫర్ట్ ఫ్యాబ్రిక్, ఆశీర్వాద్, జిఆర్టి జ్యువెలర్స్, సన్ ఫీస్ట్ మ్యారీలైట్, విమ్ వంటి ఎన్నో యాడ్స్ లో చేశారు.. స్నేహ ప్రత్యేకించి వైభవ్ కలెక్షన్స్, ఆశీర్వాద్ గులాబ్ జామ్ వంటి ఆడ్స్ లో చేసింది మొత్తం మీద ఒక్క ఆడ్స్ రూపంలోనే ఇప్పటివరకు 3 కోట్ల రూపాయలు దాకా కూడ పెట్టారని సమాచారం.

ఇకపోతే తరుణ్ హీరోగా వచ్చిన ప్రియమైన నీకు చిత్రం ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన స్నేహ ఆ తర్వాత హనుమాన్ జంక్షన్, సంక్రాంతి, రాధాగోపాలం, శ్రీరామదాసు, వెంకీ వంటి పలు సినిమాలలో నటించింది ముఖ్యంగా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ ప్రాముఖ్యత కలిగిన పాత్రలను సెలెక్ట్ చేసుకుని ఇండస్ట్రీలో సౌందర్య రేంజ్ లో దూసుకుపోయింది. అయితే అప్పటికే ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్లు రావడంతో అవకాశాలు తగ్గాయి. దాంతో తమిళంలో ఆఫర్లు రావడంతో అటువైపు వెళ్ళింది. ఇక తర్వాత కొత్త కాలానికి ప్రసన్నతో పరిచయం ఏర్పడి.. ప్రేమగా వారి అతడి వివాహం చేసుకొని సెటిల్ అయ్యింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version