గ్రూప్‌ నుంచి తీసేశారని.. వాట్సాప్ అడ్మిన్ నాలుక కోసేశారు

-

మహారాష్ట్రలోని పుణెలో దారుణం చోటుచేసుకుంది. వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి తొలగించాడనే కోపంతో అయిదుగురు వ్యక్తులు అడ్మిన్‌ను చితకబాది, నాలుకను కోసేశారు. డిసెంబరు 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అడ్మిన్‌ భార్య ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

పుణె నగరం ఫుర్సుంగిలోని ఓ హౌసింగ్‌ సొసైటీలో బాధితుడు(గ్రూప్‌ అడ్మిన్‌), నిందితులు నివసిస్తుంటారు. బాధితుడు హౌసింగ్‌ సొసైటీ సమాచారం కోసం ‘ఓం హైట్స్‌ ఆపరేషన్‌’ పేరుతో వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేశాడు. అందులో ఆ సొసైటీ సభ్యులందరూ ఉన్నారు. గ్రూప్‌ నుంచి ఇటీవల ఓ వ్యక్తిని తొలగించాడు. దీనిపై అతడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అడ్మిన్‌కు మెసేజ్‌ చేశాడు.

 

అడ్మిన్‌ స్పందించకపోవడంతో నిందితుడు ఫోన్‌ చేసి కలవాలనుకుంటున్నానని చెప్పాడు. మరో నలుగురితో కలిసి అడ్మిన్‌ దగ్గరకు వెళ్లి వాగ్వాదానికి దిగాడు. అందరూ కలిసి అతడిపై దాడి చేయడంతో పాటు నాలుక కోసేశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు నాలుకకు కుట్లు వేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version