షాపింగ్ లవర్స్​కు గుడ్ న్యూస్.. మరో మూడ్రోజుల్లో ‘అమెజాన్​ ఇండియా ప్రైమ్​ డే సేల్​’

-

షాపింగ్ లవర్స్​ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. అమెజాన్​ ఇండియా ప్రైమ్​ డే సేల్​ మరో రెండ్రోజుల్లో షురూ కానుంది. ఈ జులై 15న ప్రారంభం కానున్న ఈ సేల్ జులై 16 వరకు ఉంటుంది. కేవలం రెండు రోజులు మాత్రమే వినియోగదారులు ఈ సేల్​లో తమకు నచ్చిన ఉత్పత్తులను భారీ తగ్గింపు ధరలతో కొనుగోలు చేసుకోవచ్చు.

అమెజాన్ ప్రైమ్​డే సేల్​ జులై 15 అర్థరాత్రి 12 గంటలకు ప్రారంభమవుతుందని.. జులై 16 అర్థరాత్రి 11.59 నిమిషాలకు ముగుస్తుందని ఆ సంస్థ యాజమాన్యం తెలిపింది. మరి ఈ లిమిటెడ్​ టైమ్​లో మంచి ఆఫర్స్​, డిస్కౌంట్స్​ ఉన్న ఉత్పత్తులు ఏమేమి ఉన్నాయంటే.. అమెజాన్​ ప్రైమ్ డే సేల్​లో స్మార్ట్​ఫోన్స్​​, టెక్​ గ్యాడ్జెట్స్​, కన్జ్యూమర్​ ఎలక్ట్రానిక్స్​, టీవీ, ఫ్యాషన్ అండ్ బ్యూటీ, ఇంటికి సంబంధించిన వస్తువులు, ఫర్నీచర్​ మొదలైన అన్ని ఉత్పత్తులపై మంచి ఆఫర్లు, గొప్ప తగ్గింపు ధరలు ఉన్నాయి. అమెజాన్​ తన ప్రైమ్​ మెంబర్స్​ను ఆనందపరచడం కోసం.. ఈ సారి బుకింగ్ రోజే డెలివరీ కూడా చేస్తామని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news