ముంబయి తీరాల్లో రానా ఉన్నాడు
అక్కడికే వెళ్లి ఆ ఇంటి ఆతిథ్యం అందుకున్నారు
ట్రిపుల్ ఆర్ టీం..
సంద్రపు తీరాల్లో నవ్వుతూ నవ్విస్తూ
ఆ సాయంత్రం రానా చెప్పిన లేదా చెప్పించిన కబుర్లు
ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి..
ఇంత హడావుడిలో రానా అనే భల్లాల దేవుడు ఉన్నాడు
మరి ! ప్రభాస్ అనే అమరేంద్ర బాహుబలి ఎక్కడ …?
కెమెరా లేకపోతే ఆయన్ను మాట్లాడించడం కష్టం. అంత సిగ్గరి. కెమెరా ముందుంటే ఆపడం కష్టం ఎందుకంటే నటనలో, రికార్డుల విషయంలో ‘బాహుబలి’ మరి ! ఈ ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ నటనను చూస్తూ ‘సాహో’ అనకుండా ఉండటం కష్టం. సలాం చేసేంత ఇష్టం. అయితే బాహుబలి తర్వాత జక్కన్నకూ ప్రభాస్‌కూ మధ్య గట్టి బంధం ఏర్పడింది. మరి! ఆర్‌ఆర్‌ఆర్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలు జోరుగా సాగుతున్న వేళ మన డార్లింగ్ మాట వినిపించడంలేదెందుకు? చదవండిక ….
అలకే కారణమా?
ఆర్‌ఆర్‌ఆర్ ప్రమోషనల్ బ్యాంగ్ లో భాగంగా ఆర్‌ఆర్‌ఆర్ (రాజమౌళి, రామ్‌చరణ్, రామారావు(తారక్) లను ఇంటర్వ్యూ చేశారు రానా. ముంబైలోని సముద్రతీరం ఒడ్డున ఉన్న తన ఇంట్లో ఈ మూవీ టీమ్‌తో సరదా చిట్‌చాట్ చేశారాయన. ఈ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను ముచ్చట్లు పంచుకున్నారు వారంతా.! మరి! ఇన్ని ఈవెంట్లు, ఇంటర్వ్యూలు….ఇంత సందడిలో ఛత్రపతి స్వరం ఎక్కడా వినిపించడంలేదన్నది ఒక మాట. అందరూ అనుకుంటున్న మాట. ఒక అనుమానం కూడా ! ఇందుకు కారణమేమై ఉంటుంది అని ఆలోచిస్తే….తారక్, చెర్రీలతో ఇంత భారీ సినిమా చేస్తూ తనకు ఒక అతిథి పాత్ర కూడా ఇవ్వలేదని రాజమౌళి మీద అలిగారు ప్రభాస్.! తనకన్నా వాళ్లిద్దరంటేనే ఇష్టం అని ఉడుక్కున్నారు.! దానికి అదేం లేదని, బాహుబలి తర్వాత ప్రభాస్ స్థాయికి తగిన పాత్ర ఇవ్వాలంటే మామూలు విషయం కాదని నవ్వేశారట రాజమౌళి. ! ఇదంతా రాధేశ్యామ్ ప్రమోషనల్ కార్యక్రమంలో రాజమౌళి…ప్రభాస్‌ల మధ్య జరిగిన సరదా చిట్‌చాట్. అంటే ఇది మనసులో పెట్టుకునే ప్రభాస్ ఈ ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో ఎక్కడా కనిపించడం లేదా? లేదా షూటింగ్స్‌లో బిజీగా ఉండి ట్రిపుల్ ఆర్ ఈవెంట్లకు రావడం లేదా? అని సినిమా జీవులందరూ గందరగోళపడుతున్నారు.
– పూర్ణిమా స్వాతి గోపరాజు