శృంగారంతో మంకీపాక్స్‌ వ్యాప్తి.. తేల్చి చెప్పిన డబ్ల్యూహెచ్‌వో

-

మానవాళి మనుగడనే ప్రశ్నించే విధంగా వైరస్‌లు ప్రజలపై విరుచుకుపడుతున్నాయి. కరోనా వైరస్‌ ఓవైపు ప్రజలను భయాభ్రాంతులకు గురి చేస్తుంటే.. ఇప్పుడు మంకీపాక్స్‌ వైరస్‌ ఆందోళన కలిగిస్తోంది. అయితే మంకీపాక్స్‌ రోజు రోజుకు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. ఈ వైరస్‌పై పరిశోధనలు చేసి దాని ఉనికి కనుగోన్నారు. అయితే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మంకీపాక్స్‌ వ్యాప్తికి గల ప్రధాన కారణం ఏంటో వెల్లడించింది. శృంగారం కారణంగానే అది ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నట్టు పేర్కొంది. మాట్లాడేటప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా అది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని చెప్పేందుకు తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ తెలిపారు.

మంకీపాక్స్ వైరస్ సోకినవారు ఇతరులకు దూరంగా హోం ఐసోలేషన్‌లో ఉండాలని, వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచించారు. ఈ వైరస్‌కు చికిత్స కోసం యాంటీవైరల్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రస్తుతానికి ఇవి అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ వైరస్‌కు వ్యతిరేకంగా అద్భుతంగా పనిచేస్తున్నట్టు చెప్పారు. అయితే, ఈ వైరస్ నివారణకు సామూహిక వ్యాక్సినేషన్ అవసరం లేదని తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు 29 దేశాల్లో 1000కిపైగా కేసులు నమోదయ్యాయని, గతంలో మంకీపాక్స్ లేని దేశాల్లోనూ ఇప్పుడు కేసులు వెలుగు చూస్తున్నట్టు టెడ్రోస్ తెలిపారు. అలాగే, ఈ వైరస్ వల్ల ఆఫ్రికాలో ఇప్పటి వరకు 66 మంది మృతి చెందినట్టు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version