నేటితరం స్టార్ హీరోలను తెలుగు తెరకు పరిచయం చేసింది ఎవరంటే..?

-

సాధారణంగా ఒక వ్యక్తి హీరోగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అవ్వాలి అంటే దర్శకుడు కథ మాత్రం చెబితే సరిపోదు.. ఆ సినిమా తెరకెక్కడానికి డబ్బులు కూడా కావాలి.. ఆ డబ్బులు పెట్టేది నిర్మాత మాత్రమే కదా.. ఇక సినీ సెలబ్రిటీల వారసులను ఇండస్ట్రీలోకి పరిచయం చేయాల్సి వస్తే ముందుగా వారసుల తండ్రులు, ప్రముఖ నిర్మాతలతో చర్చలు జరిపిన తర్వాతనే ఒక మంచి డైరెక్టర్ , రైటర్ ను పట్టుకొని కథ రాయించి ఆ తర్వాత తమ వారసులను ఇండస్ట్రీలోకి ప్రవేశింప చేస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోని ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు లాంటి హీరోలు వారసులుగా ఎంట్రీ ఇవ్వడానికి ఒక ప్రముఖ నిర్మాత కారణమయ్యారు. అంతేకాదు వీరందరినీ ఇండస్ట్రీలోకి పరిచయం చేసేటప్పుడు ఆయన బ్యానర్ ద్వారానే ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది.

ఇక ఆయన ఎవరో కాదు ప్రముఖ సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ గారు. ఇక ఈయన వైజయంతి మూవీస్ బ్యానర్ ను ఏర్పాటు చేసి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి స్టార్ హీరోలతోనే కొన్ని పదుల సంఖ్యలో సినిమాలను తెరకెక్కించారు. తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరైన అశ్వినీ దత్ అప్పటి ముచ్చట్లను.. నేటి తరం సినిమా ముచ్చట్లను కూడా ఆలీతో ముచ్చటించడం జరిగింది .ఇకపోతే ఎన్టీఆర్, ఏఎన్నార్లతో సినిమా తీసే సమయంలో సినిమా బడ్జెట్ కేవలం రూ.15 నుంచి రూ. 20 లక్షలు మాత్రమే ఖర్చయ్యేదని కానీ ఈ కాలంలో ఆ డబ్బును హీరో, హీరోయిన్ల మేకప్ మ్యాన్ లకు ఇస్తున్నాము అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇక అంతేకాదు వైజయంతి మూవీస్ బ్యానర్ పై రామ్ చరణ్ ను చిరుత.. మహేష్ బాబును రాజ కుమారుడు.. అల్లు అర్జున్ గంగోత్రి.. ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రాల ద్వారా ఈ స్టార్ హీరోలు అందరిని ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ తెలుగు తెరకు పరిచయం చేశారు. అయితే ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాను ముందుగా ప్రభాస్ కోసం అనుకోగా ప్రభాస్ తండ్రి కృష్ణంరాజు ఏం మాట్లాడక పోయేసరికి హరికృష్ణ గారు ఫోన్ చేయడంతో ఎట్టకేలకు ఈ సినిమా ఎన్టీఆర్కు సెట్ అయిందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version