ఎట్టకేలకు బాలయ్య కోసం హీరోయిన్ ను పట్టుకొచ్చిన డైరెక్టర్.. ఎవరంటే..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో 6 పదుల వయసు వచ్చినా సరే బాలకృష్ణ వరుస సినిమాలు చేసుకుంటూ తన క్రేజ్ ను చూపించుకుంటున్నారు. ముఖ్యంగా వరుస సినిమాలను అనౌన్స్ చేస్తూ అభిమానుల గుండెలను ఆకట్టుకుంటున్నాడు . ఇకపోతే అఖండ విజయంతో ఆయన హడావిడి మామూలుగా లేదని చెప్పాలి. ఇక అఖండ తర్వాత తన 107వ సినిమా యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి కావస్తోంది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో మరొకసారి బాలయ్య తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా పూర్తి కాకనే బాలయ్య తన తదుపరి చిత్రాన్ని కూడా పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యారు.

ఇక మరొక యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమాను చేయబోతున్నాడు బాలకృష్ణ. ఇకపోతే తాజాగా గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అనే విషయం హాట్ టాపిక్ గా మారుతుంది. నిజానికి టాలీవుడ్ లో సీనియర్ హీరోలకు, హీరోయిన్లకు చాలా కొరత ఉంది. ఉన్నవాళ్లను రిపీట్ చేసే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా కొత్త హీరోయిన్లను సీనియర్ హీరోల పక్కన పెడితే సెట్ అవ్వరు .. ఏజ్ గ్యాప్ కూడా ఎక్కువ ఉండడంతో యంగ్ హీరోయిన్స్ తో చేసే అవకాశమే లేదు. ఒకవేళ చేసినా కూతురితో చేశారనే విమర్శలు కూడా వస్తాయి. ఇక ఈ క్రమంలోనే బాలయ్య బాబుకు ఎలాంటి హీరోయిన్ తీసుకురావాలనే ఆలోచనలో పడ్డ అనిల్ రావిపూడి ఎంతో కష్టపడి మరింత ఆలోచించి ఆయనకు ఇష్టమైన హీరోయిన్ నయనతారను తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మరి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కూడా నయనతార హీరోయిన్గా నటిస్తోందని వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఇందులో ఎంత నిజం ఉంది అనే విషయం తెలిసే వరకు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావాల్సిందే. ఒకవేళ ఇదే కాంబినేషన్ రిపీట్ అయితే అభిమానులకు పండగ అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version