పంజాబ్ రైతులను పరామర్శిస్తే..తెలంగాణ రైతులను ఎవరు ఆదుకోవాలి : దాసోజు శ్రవణ్

-

సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. కెసిఆర్ స్వార్థం కోసం, కేంద్ర రాజకీయాల్లో స్థానం సంపాదించుకోవడం కోసమే ఢిల్లీ వెళ్లారని అన్నారు. కెసిఆర్ పంజాబ్ రైతులను పరామర్శించడానికి వెళ్లారు.. మరి తెలంగాణ రైతులను ఎవరు ఆదుకోవాలి..?పంజాబ్ ముఖ్యమంత్రి ఆదుకుంటారా..? అంటూ ప్రశ్నించారు. మన రక్తమాంసాలతో ఏర్పడ్డ ప్రభుత్వ ఖజానాకు పంజాబ్ రైతులకు సహాయం కోసం ఇస్తా అని వెళ్ళాడు అంటూ ఫైర్ అయ్యారు. పంజాబ్ రైతులు ఢిల్లీలో నిరసన తెలిపినప్పుడు ఒక్కరోజు కూడా అక్కడికి వెళ్లి సంఘీభావం తెలపలేదని మండిపడ్డారు.

8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే 194 జీవో ప్రకారం కేవలం వెయ్యి మందికి మాత్రమే ఆరు లక్షల ఆర్థిక సహాయం చేశారని అన్నారు. మిగతా ఏడు వేల మంది రైతుల కుటుంబాల్లో మట్టి కొట్టారని అన్నారు శ్రవణ్. పంజాబ్ రైతులకు సహాయం కెసిఆర్ ఆడుతున్న డ్రామా తప్ప దేశవ్యాప్త రైతులను ఆదుకోవాలని కాదన్నారు. గజ్వేల్ లో రైతు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. టిఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. కెసిఆర్ రైతులను ఓట్ల బిచ్చగాళ్ళుగా చూస్తున్నారు అని, నెల రోజుల పాటు కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకు వెళ్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news