Big Boss Non Stop: ‘బిగ్ బాస్’ ఇంటి నుంచి బయటకు వెళ్లేదెవరు.. సింగిల్ లేదా డబుల్ ఎలిమినేషన్!

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఓటీటీ రోజురోజుకూ వెరీ ఇంట్రెస్టింగ్ గా సాగుతున్నదని బీబీ లవర్స్ అంటున్నారు. కంటెస్టెంట్స్ గేమ్ ను చాలా సీరియస్ గా తీసుకుని టాస్కులు కంప్లీట్ చేస్తున్నారు. కాగా, ఆరో వారంలో ఎలిమినేట్ అయే కంటెస్టెంట్స్ ఎవరు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా ఉంది. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ఎవరికి ఎక్కువ చాన్సెస్ ఉన్నాయి. ‘బిగ్ బాస్’ ఎవరిని బయటకు పంపుతారని చర్చించుకుంటున్నారు.

ఈ వారం ఎలిమినేషన్ కు పది మంది నామినేషన్స్ ఉన్నాయి. యాంకర్ శివ, అషురెడ్డి, నటరాజ్ మాస్టర్, బిందు మాధవి, అజయ్ , శ్రవంతి, మహేశ్ విట్టా, మిత్రా శర్మ, హమీద, ముమైత్ ఖాన్లు నామినేషన్ లో ఉన్నారు. వీరిలో టాప్ పొజిషన్‌లో బిందు మాధవి ఉంది. అయితే, బిందు మాధవి పర్ఫార్మెన్స్ లాస్ట్ వీక్ కంటే కొంచెం తగ్గింది. 30 నుంచి 36 పర్సెంటేజీ ఓటింగ్ ఈమెకు వచ్చింది. మొత్తంగా బిందు మాధవి అయితే కంప్లీట్ సేఫ్ జోన్ లోనే ఉందని చెప్పొచ్చు.

యాంకర్ శివ కూడా సేఫ్ జోన్ లోనే ఉన్నాడు. మహేశ్ విట్టా, హమీదలకు 6 నుంచి 8 శాతం ఓటింగ్ రాగా, వీరు కూడా సేఫ్ జోన్ లోనే ఉన్నారు. ఇక మిగిలిన ఆరుగురు కంటెస్టెంట్స్ 30 నుంచి 34 పర్సెంట్ ఓటింగ్ షేర్ చేసుకున్నారు. అయితే, ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందా? అనే చర్చ కూడా ఉంది. అనగా హోస్ట్ నాగార్జున రాక మునుపే ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్స్ లో సింగిల్ లేదా డబుల్ ఎలిమినేషన్ చేయొచ్చు.

ఇక మిగిలిన్ ఆరుగురు కంటెస్టెంట్స్ లో అషురెడ్డి, నటరాజ్ మాస్టర్, మిత్రా శర్మ.. సేఫ్ అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆ ప్రకారంగా.. అజయ్, ముమైత్ ఖాన్, శ్రవంతి.. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు లేదా ఇద్దరూ ఎలిమినేట్ కావొచ్చు. గత రెండు లేదా మూడు రోజుల నుంచి అజయ్ ఓటింగ్ పర్సంటేజీ తగ్గింది.

ఒక వేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే కనుక అజయ్- శ్రవంతి లేదా అజయ్ – ముమైత్ ఖాన్ లేదా ముమైత్ ఖాన్- శ్రవంతి ఈ కాంబినేషన్ లో ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు. అయితే, మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కావల్సిందే అంటే మాత్రం తప్పకుండా అజయ్ ఇంటి నుంచి బయటకు వెళ్తాడు. చూడాలి మరి.. హౌజ్ నుంచి బయటకు ఎవరు వెళ్తారో..

Read more RELATED
Recommended to you

Exit mobile version