థైరాయిడ్‌ ఉన్నవారికి జుట్టు ఎందుకు ఊడిపోతుంది..? బరువు ఎందుకు పెరుగుతారు..?

-

అదేంటో మహిళల కోసమే రాసిపెట్టినట్లు కొన్ని రోగాలు ఎక్కువగా లేడీస్‌కే వస్తుంటాయి. అలాంటి వాటిలో థైరాయిడ్‌ కూడా ఒకటి.. ఇది వస్తే..అయితే బాగా లావు అవుతారు, లేదా బాగా సన్నగా అయిపోతారు. ఏం చేయకుండా బాడీలో మార్పులు వస్తున్నాయంటే..అది అనారోగ్య లక్షణం. జాగ్రత్తపడటం అవసరం. అయితే థైరాయిడ్‌ వల్ల జుట్టు ఎందుకు రాలుతుంది, బరువు మీద ఎందుకు ప్రభావం పడుతుందో తెలుసా..?

థైరాయిడ్ అనేది మెడ భాగంలో సీతాకోకచిలుక అకారంలో ఉండే గ్రంధి. ఇది శరీరంలోని జీవక్రియలను నియంత్రిస్తుంది. కొన్ని అసాధారణ పరిస్థితుల్లో ఈ గ్రంధి నుండి విడుదలయే హార్మోన్ల రుగ్మత కారణంగా జుట్టు రాలడం, బరువు పెరగడం వంటి సమస్యలు ఏర్పడుతాయి.

థైరాయిడ్ లక్షణాలు-

కొంత మందిలో అకస్మాకంగా బరువు పెరగడం
జుట్టు రాలడం
అలసట
అధిక నిద్ర
నెలసరిలో మార్పులు.
ఇవి ప్రాధమిక లక్షణాలుగా భావించవచ్చు..థైరాయిడ్ గ్రంధి హార్మోన్‌ను అధికంగా లేదా తక్కువ పరిమాణంలో ఉత్పత్తి చేస్తుంది. ఈ సమయంలో జుట్టు రాలడం, బరువు పెరగడం వంటి సమస్యలు ఏర్పడతాయి. అయితే ఇలాంటి సందర్బాలలో ఈ హార్మోన్‌ను బ్యాలెన్స్ చేయడం చాలా ముఖ్యం

థైరాయిడ్ వల్ల జుట్టు ఎందుకు రాలుతుంది?

సాధారణంగా థైరాయిడ్ గ్రంధిలో ఏమైన లోపాలు ఉంటే జుట్టు రాలిపోతుంది. థైరాయిడ్ గ్రంధి నుంచి విడుదలయ్యే టి3, టి4 హార్మోన్లు జుట్టు పెరుగుదలకు సహకరిస్తాయి. ఈ రెండూ జుట్టు పిగ్మెంటేషన్‌ను నియంత్రిస్తాయి. ఈ రెండూ ఎక్కువ లేదా తక్కువ ఉంటే, జుట్టు ఎక్కువగా రాలడం ప్రారంభమవుతుంది.

బరువు పెరుగడం అంటే..

ఆకస్మికంగా బరువు పెరగడం హైపో థైరాయిడిజంలో ప్రధాన లక్షణంగా వైద్యులు చెప్తున్నారు.. ఈ సమయంలో ఆందోళన, అతి నిద్ర, దృష్టిలో ఇబ్బంది, హృదయ స్పందనలో మార్పు వంటి లక్షణాలు కనిపిస్తాయట.. ముఖ్యంగా హైపోథైరాయిడిజం సమయంలో, బరువు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

థైరాయిడ్‌కు జుట్టు రాలిపోవడానికి అది అనమాట సంబంధం.. ఇప్పటికే థైరాయిడ్‌త బాధపడేవారు చికిత్స పొందుతూనే.. మంచి ఆహారపు అలవాట్లను పాటిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. థైరాయిడ్‌ ఉన్నవారికి ఏం ఆహారం తినాలో వాటిని రెగ్యులర్‌గా తీసుకుంటే సమస్య కంట్రోల్‌లో ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news