వేసవికాలంలో రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వేసవికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే చాలా మంది రకరకాల లిక్విడ్స్ తీసుకుంటూ ఉంటారు. జ్యూసులు మొదలు ఎన్నో రకాల పానీయాలని తీసుకుంటూ ఉంటారు. అయితే చాలా మంది కొన్ని రకాల తప్పులని ఈ క్రమంలో చేస్తూ ఉంటారు. ఎటువంటి తప్పులు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వేసవికాలంలో చాలా మంది తీసుకుని డ్రింకుల వలన పంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి పంటి సమస్యలు ఏమీ లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఎందుకు వేసవిలో తీసుకునే డ్రింకుల వలన పంటకి ఇబ్బందులు కలుగుతాయనే విషయాన్ని చూస్తే సోడా, జ్యూసెస్ వంటివి తీసుకుంటూ ఉంటారు ఇందులో ఉండే షుగర్ ఫ్రీ ఆసిడ్ వలన రకరకాల సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది దీంతో పంటికి ఇబ్బంది కూడా కలుగుతుంది. షుగర్ ఇందులో ఎక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ ని తీసుకుంటే జీర్ణ సమస్యలు అలానే పంటి సమస్యలు కూడా వస్తాయి అలానే ఆసిడ్ వలన పంటి ఎనామిల్ తొలగిపోతుంది. పళ్ళు పచ్చగా మారే అవకాశం కూడా ఉంటుంది.
కాబట్టి వీటిని తగ్గించడం మంచిది పళ్ళు పసుపుగా మారడం డీప్ సెన్సిటివిటీ దంతాల సమస్యలు పళ్ళు పుచ్చిపోవడం, చెడు శ్వాస, నోరు ఆరిపోవడం ఇలా రకరకాల సమస్యల్ని ఎదుర్కోవాలి. ఇలాంటి సమస్యలు కలగకూడదంటే వేసవికాలంలో రకరకాల డ్రింకులను తీసుకునే బదులు కొబ్బరి నీళ్లు, తాజా పండ్ల రసాలు, బెల్లంతో చేసిన నిమ్మరసం, ఇస్డ్ గ్రీన్ టీ వంటివి తీసుకోండి ఇటువంటివి తీసుకుంటే పంటి సమస్యలు రావు. లేకపోతే అనవసరంగా లేని పోని సమస్యలను ఎదుర్కోవాలి. పంటి సమస్యల మొదలు రకరకాల సమస్యలు కలుగుతాయి. కాబట్టి వేసవిలో తీసుకునే డ్రింకుల విషయంలో జాగ్రత్త పడండి.