టీడీపీ పార్టీ ఇప్పుడు ఏపీలో దాదాపు తీవ్ర గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ప్రజల నమ్మకాన్ని పూర్తిగా విస్మరిస్తోందనే ప్రచారం జరుగుతోంది. అసలు ఎలాంటి పోరాట పటిమను చూపించుకుండా మౌనంగా ఉంటోందనే కాడికి పార్టీ వ్యవహారం వస్తోంది. ఇలాంటి సమయంలో పార్టీ ముందు ఉన్న రెండు అంశాల్లో చంద్రబాబు ఎందుకు వెనకడుగు వేస్తున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు.
ఇక సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయనే క్రమంలో విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ విషయంలో ఎందుకు పోరాడటానికి సిద్ధం కావట్లేదనే విమర్శలు అనేకం వినిపిస్తున్నాయి. టీడీపీకి మంచి చాన్స్ ఉన్న ఈ అంశంపై పోరాడితే గనక మళ్లీ ప్రజల్లో నమ్మకాన్ని పొందవచ్చు. కానీ ఆ విధంగా మాత్రం పోరాడట్లేదనే చెప్పాలి.
ఇక ఇంకో విషయం ఏంటంటే జల వివాద విషయంలో వైసీపీ కలిసి రాకపోయినా పోరాటాలు చేస్తే ఆ పార్టీకి అనేక రకాలుగా రాయలసీమ ప్రజలు అండగా ఉండే అవకాశం ఉంది. అసలు రాయలసీమలో పార్టీ కనుమరుగయ్యే పరిస్తఙతులు వస్తున్నాయి. ఇలాంటి టైమ్‌లో ఈ రెండు అంశాలపై ఎందుకు వెనకడుగు వేస్తున్నారో అర్థం కావట్లేదు. కేవలం లేఖలతోనే సరిపెడుతున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. కానీ గట్టిగా పోరాడితే మాత్రం పార్టీకి మంచి ప్రయోజనం ఉంటుంది.