అన్నదాతలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పనుందా..?

-

ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోవచ్చునని తెలుస్తోంది. దీనితో అన్నదాతలకు కేంద్రం గుడ్ న్యూస్ ని చెప్పనుందా లేదా అనేది తెలిసి పోతుంది. ఫెర్టిలైజర్స్ సబ్సిడీ పెంచే ఛాన్స్ ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

farmers

అంతర్జాతీయ మార్కెట్‌ లో కమోడిటీ ధరలు భారీగా పెరిగాయి. ఈ సమయం లో ఫెర్టిలైజర్స్ తయారీ కూడా భారం అవుతుంది. ఫెర్టిలైజర్స్ తయారీ కంపెనీలు ధరల పెంపు వల్ల తక్కువ దిగుమతులు చేసుకోవడం జరుగుతోంది. అయితే ఈ పరిస్థితి లో కేంద్ర ప్రభుత్వం వివిధ ఫెర్టిలైజర్స్‌పై సబ్సిడీని పెంచే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

ఫెర్టిలైజర్స్ తయారీ కంపెనీలు, ఫార్మా కంపెనీలకు ఈ సబ్సిడీని పెంచితే బెనిఫిట్ ని పొందుతారు. ఒక్కసారి ఫెర్టిలైజర్స్‌కు ప్రయోజనం కలిగితే వాటిని కంపెనీలు రైతులకు ఇవ్వడం జరుగుతుంది. అంటే అందుబాటు ధరలోనే ఎరువులు అన్నదాతలు పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌ లో సబ్సిడీ బడ్జెట్‌కు తగ్గించిందన్న సంగతి తెలిసిందే.

2022-23లో రూ.63 వేల కోట్లు కేటాయించింది. అయితే ఇది గతం లో కంటే 17 శాతం తక్కువ. అయితే ఇది యూరియా సబ్సిడీకి మాత్రమే. అదే ఎన్‌పీకే ఫెర్టిలైజర్స్ సబ్సిడీ అయితే 35 శాతం తగ్గింది. గత కొన్నేళ్లుగా ఫెర్టిలైజర్ సబ్సిడీ కేటాయింపులను కేంద్రం తగ్గిస్తూనే వుంది. 2020-21లో మొత్తం ఫెర్టిలైజర్ సబ్సిడీ కేటాయింపులు రూ.1,27,921 కోట్లుగా ఉన్నాయి. 2021-22లో ఈ కేటాయింపు రూ.79,529 కోట్లకు తగ్గింది. తర్వాత రూ.1,40,122 కోట్లకు పెంచారు. ఇప్పుడైతే రూ.1,05,222 కోట్లుగా ఉన్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news