గత ఎన్నికల్లో వన్ సైడ్ గా గెలిచినట్లుగా…నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీ వన్ సైడ్ గా గెలవడం కష్టమవుతుందా? 2019 ఎన్నికల సీన్ 2024 ఎన్నికల్లో రిపీట్ కావడం కష్టమేనా? ఈ సారి ప్రతిపక్ష టీడీపీ..వైసీపీకి గట్టి పోటీ ఇవ్వనుందా? అంటే ప్రస్తుతం ఏపీలో ఉన్న రాజకీయ పరిస్తితులని చూస్తే అవుననే చెప్పొచ్చు..ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఆ జిల్లా, ఈ జల్లా అనే తేడా లేకుండా…అన్నీ జిల్లాల్లో జగన్ గాలి గట్టిగా వీచింది…ఫలితంగా టీడీపీ ఘోరంగా ఓడిపోగా, వైసీపీ అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుని జగన్ సీఎం అయ్యారు.
ఇక జగన్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయింది…మరి ఈ మూడేళ్లలో వైసీపీ బలం ఏమన్నా తగ్గిందా? అంటే ఖచ్చితంగా తగ్గిందనే చెప్పాలి..2019 ఎన్నికల్లో ఉన్న పరిస్తితి ఇప్పుడు లేదనే చెప్పాలి..చాలా వరకు వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరిగింది…గడప గడపకు వెళుతున్న వైసీపీ ప్రజా ప్రతినిధులని ప్రజలు నిలదీస్తున్న దాని బట్టి పరిస్తితి ఎలా ఉందో అర్ధమవుతుంది. ఏదో జగన్ ఇమేజ్ ఉండటం వల్ల వైసీపీకి పెద్ద నెగిటివ్ ఉన్నట్లు కనబడటం లేదు గాని…క్షేత్ర స్థాయిలో వైసీపీపై బాగానే వ్యతిరేకత కనిపిస్తోంది.
పైగా ప్రతిపక్ష టీడీపీ కూడా చాలా వరకు పుంజుకుంది..ఈ పరిస్తితుల నేపథ్యంలో మళ్ళీ జగన్ సీఎం కావడం అనేది చాలా కష్టమైన పని..ఆయన ఇంకో సారి సీఎం అవ్వాలంటే వైసీపీ నేతలు బాగా కష్టపడాలి. 2019 ఎన్నికల్లో వచ్చినట్లు 151 సీట్లు రాకపోయినా..కనీసం 100 సీట్లు అయిన వస్తే జగన్ సీఎం అవుతారు…లేదంటే అధికారం కోల్పోవాల్సి వస్తుంది.
అయితే జగన్ కు ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే…వైసీపీకి కంచుకోటలు కొన్ని ఉన్నాయి…ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వడ్ నియోజకవర్గాలు వైసీపీకి అండగా ఉంటున్నాయి. గత ఎన్నికల్లో ఈ సీట్లని వైసీపీ కైవసం చేసుకుంది…మళ్ళీ వీటిన దక్కించుకుని, చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం లాంటి జిల్లాల్లో 90 శాతం సీట్లు గెలుచుకుంటే…మళ్ళీ జగనే సీఎం.