తెలంగాణలో చలి చంపెస్తోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో… చలి తీవ్రత పెరగుతోంది. గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి ఎక్కువగా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలకు పడిపోతున్నాయి. ఆదిలాబాద్ బజార్ హత్నూర్ లో అత్యల్పంగా 7.3డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కుమ్రంభీం, భూపాలపల్లి, నిర్మల్, మంచిర్యాల, మెడ్చల్ మల్కాజ్ గిరి, ములుగు, రంగారెడ్డి జిల్లాల్లో 10 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొని ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 15-18 డిగ్రీల వరకు నమోదువుతుందని.. గరిష్ట ఉష్ణోగ్రతలు 30-33 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అవుతాయిని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ ఉష్ణోగ్రలు నమోదు అవుతున్నాయి. దీంతో పాటు పలు ప్రాంతాల్లో పొగమంచు పరిస్థితులు ఉన్నాయి.