మీ స్నేహితులకి, కుటుంబ‌ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షల్ని ఇలా తెలపండి..!

-

హిందూమతంలో పూజింపబడే అనేక దేవతా మూర్తులలో దాదాపు అన్ని సంప్రదాయాలను అన్ని ప్రాంతాల్లోనూ బహుళంగా అర్చింపబడే దేవుడు వినాయకుడు నాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వినాయకుడిని శైవం, వైష్ణవం, జైనం, బౌద్ధలు కూడా పూజిస్తారు. అలానే భారతదేశం వెలుపల చైనా, నేపాల్, టిబెట్, జపాన్, ఇండోనేషియా వంటి దేశాలలో కూడా వినాయకుడిని పూజిస్తారు. అయితే మనకి ఏదైనా పూజ కానీ ఏదైనా వ్రతం కానీ వచ్చింది అంటే కచ్చితంగా ప్రథమంగా మనం వినాయకుడిని పూజిస్తాము.

ఒక పుట్టినరోజు కానీ, ఒక పెళ్లి రోజు కానీ లేదా ఒక శంకుస్థాపన కానీ గృహప్రవేశం కానీ కచ్చితంగా వినాయకుడికి పూజ చేసి… ఆ తర్వాత మరే ఇతర దేవుడిని అయినా పూజిస్తూ ఉంటాము. అన్ని కులాలు సంప్రదాయాలు శాఖల్లోనూ మరియు అన్ని ప్రాంతాల్లో కూడా వినాయకుడిని పూజిస్తారు. అయితే వినాయకుడిని కొలిచి అందరూ కలిపి ఉత్సవంగా జరిపేది వినాయక చవితి.

ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు వినాయక చవితి చేస్తారు. అలానే మాఘ కృష్ణ చతుర్దశి నాడు వినాయక జయంతి జరుపుతారు. వినాయక జయంతి కంటే కూడా వినాయక చవితి ఎక్కువమంది చేస్తారు. అయితే ఈసారి వినాయకచవితి సెప్టెంబర్ 10న వచ్చింది. మరి వినాయక చవితి నాడు మీ కుటుంబ సభ్యులకి, స్నేహితులకి మంచి జరగాలని ఇలా శుభాకాంక్షలు తెలపండి.

 

వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు

మట్టి గణపతినే పూజిద్దాం..! పర్యావరణాన్ని కాపాడుదాం.. మీకు, మీ కుటుంబ సభ్యులకి వినాయక చవితి శుభాకాంక్షలు..

మీరు చేసే ప్రతి కార్యం ఆ వినాయకుడు ఆశీస్సులతో విజయం కావాలని వినాయక చవితి రోజున మీరందరూ ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ |
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ||
మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

విఘ్నధిపతికి చేద్దాం వందనం…విజయం కోసం ప్రార్ధిర్ధం అందరం..మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

వినాయక చవితి పండుగ రోజున మీరంతా ఆనందంగా ఉండాలని కొరుకుతూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news