మైనర్ బాలుడితో మహిళ అఫైర్..ఒత్తిడి తేవడం తో దారుణం..!

-

మైనర్ బాలుడితో పెట్టుకున్న వివాహేతర సంబంధం చివరకు మహిళ ప్రాణం తీసింది. ఈ ఘటన బెంగుళూరు బసశంకరి లోని యారబ్ నగర్ లో చోటు చేసుకుంది. ఆఫ్రినా ఖానం (28) టైలర్ వృత్తిలో కొనసాగుతోంది. అయితే అఫ్రినా ఇంటిపక్కనే ఆమెకు బంధువులు అయిన ఓ కుటుంబం కొత్త ఇల్లు నిర్మిస్తోంది. ఆ కుటుంబం లోని కుర్రాడు ,(17) తరచూ ఇంటికి వచ్చి వెలుతుండటం తో అఫ్రీనా కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ఆ తరవాత ఇద్దరం కలిసి ఎక్కడకు అయినా వెళ్ళిపోదామని అఫ్రీన్ బాలుడిపై ఒత్తిడి తెచ్చింది. దాంతో బాలుడు ఆమెతో గొడవ పడ్డాడు. అంతే కాకుండా తన కు డబ్బులు ఇవ్వాలని కోరాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా అక్కడే ఉన్న కత్తెర తీసుకుని దారుణంగా హత్య చేశాడు. అనంతరం అక్కడ నుండి పరార్ అయ్యాడు. స్థానికంగా కలకలం రేపిన ఈ కేసును మొదట మిస్టరీ గా నమోదు చేసుకున్న పోలీసులు ఒక్కరోజులో నిందితున్ని పట్టుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version