వీళ్లకంటే కుక్కలు నయం.. మహిళపై సామూహిక అత్యాచారం..

-

ఇంటి నుంచి బయటకు స్త్రీలను పంపించాలంటే భయం వేసే పరిస్థితులు సమాజంలో నెలకొంటున్నాయి. సందులో ఉన్న కిరాణ షాపు వెళ్లిన, ఒంటరిగా బహిర్భుమికి వెళ్లినా ఇలా ఒంటరిగా స్త్రీల కనిపిస్తే చాలు.. కామాంధులు రెచ్చిపోతున్నారు. స్త్రీల జీవితాలను నాశనం చేస్తున్నారు. కనీసం రోడ్డుపై కుక్కలు కూడా ఈ విధంగా ప్రవర్తించవేమో అనే అనుమానం కలిగించేలా.. ఈ మృగాళ్లు ప్రవర్తిస్తున్నారు. తాజాగా.. తమిళనాడు రామేశ్వరంలో దారుణం జరిగింది. ఓ 45 ఏళ్ల మహిళపై ఒడిశాకు చెందిన ఆరుగురు వలస కార్మికులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఆమెను చంపి, మృతదేహాన్ని తగలబెట్టారు.

సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. రామేశ్వరంలోని వడకాడు మత్స్యకార గ్రామంలో మంగళవారం ఉదయం చేపల కోసం బాధితురాలు వెళ్లింది. చాలాసేపు అయినా ఇంటికి తిరిగి రాకపోవడం వల్ల ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే గ్రామంలో ఉన్న రొయ్యల ఫామ్‌లో ఓ మహిళ మృతదేహం పాక్షికంగా కాలిపోయి పడి ఉందని పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి పరిశీలించారు.

అది బాధితురాలి మృతదేహం అని తేల్చారు.ఆ సమయంలోనే బాధితురాలి హత్యాచారంలో ఆరుగురు వలస కార్మికుల ప్రమేయం ఉందని తెలుసుకున్న గ్రామస్థులు వారిని చితక్కొట్టారు. అనంతరం బాధితురాలికి న్యాయం చేయాలంటూ రామేశ్వరం జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న ఆరుగురు వలస కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. కేసుపై సమగ్ర విచారణ జరుపుతున్నట్లు తెలిపారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version